కుప్పకూలిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 396 పాయింట్లు పతనం, నిఫ్టీ 18 వేల స్థాయికి..

Ashok Kumar   | Asianet News
Published : Nov 16, 2021, 04:42 PM IST

నేడు  మంగళవారం నష్టాలతో  ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ (stock market)ట్రేడింగ్‌ ముగిసే వరకు జోరును అందుకోలేకపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బి‌ఎస్‌ఈ(bse) సెన్సెక్స్ (sensex)396.34 పాయింట్లు (0.65 శాతం) క్షీణించి 60,322.37 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ(nse) నిఫ్టీ (nifty)18000 స్థాయిని కొనసాగించలేకపోయింది అలాగే 110.25 పాయింట్లు (0.61 శాతం) పడిపోయి 17,799 వద్ద ముగిసింది.

PREV
14
కుప్పకూలిన  స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 396 పాయింట్లు పతనం, నిఫ్టీ 18 వేల స్థాయికి..

ఈ వారం రెండో రోజు కూడా స్టాక్‌ మార్కెట్‌ నష్టాలతోనే ముగిసింది.  బ్లూ చిప్‌ కంపెనీ ఇన్వెస్టర్లు లాభాలు తీసుకునేందుకు ఆసక్తి చూపించడంతో దేశీ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మకాలే ఎక్కువగా జరిగాయి. ఆటోమొబైల్‌ పరిశ్రమకు చెందిన షేర్లు లాభాలు పొందడంతో మార్కెట్‌కి కొంత ఊరట లభించింది.  మధ్యాహ్నం సమయంలో కద్ది కోలుకున్నట్టు కనిపించినా మరోసారి ఇన్వెస్టర్లు అమ్మకాలు మొదలుపెట్టడంతో నష్టాలు తప్పలేదు. 

24

 బి‌ఎస్‌ఈ 30-షేర్ల సెన్సెక్స్ 120.81 పాయింట్లు (0.20 శాతం) క్షీణించి 60,597.90 వద్ద ప్రారంభమైంది, అయితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26.35 పాయింట్లు (0.15 శాతం) పడిపోయి 18,083 స్థాయి వద్ద ప్రారంభమైంది.

34

లాభాల్లో ఉన్న కంపెనీలు
నేటి ట్రేడింగ్ సమయంలో టాటా మోటార్స్, మారుతీ సుజుకీ షేర్లు మంచి లాభాలను చవిచూశాయి. మరోవైపు టాటా ఇస్పాత్‌, హెచ్‌డీఎఫ్‌సీ వంటి కంపెనీల షేర్లు భారీగా క్షీణించాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2 శాతం క్షీణించగా, నిఫ్టీ బ్యాంక్‌, ఎనర్జీ, ఫార్మా సూచీలు 1 శాతం చొప్పున పతనమయ్యాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.22 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ సూచీ స్వల్ప లాభాలతో ముగిసింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతి సుజూకి కంపెనీ షేర్లు లాభాలు పొందగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ , హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీగా నష్టపోయాయి.

44

సోమవారం స్వల్ప పెరుగుదలతో 
సోమవారం నాడు  స్టాక్ మార్కెట్ జోరుగా ప్రారంభమైనప్పటికీ ట్రేడింగ్ ముగిసే సమయానికి భారత స్టాక్ మార్కెట్ స్వల్ప పెరుగుదలతో ముగిసింది. రోజంతా ట్రేడింగ్‌లో ఎన్నో హెచ్చు తగ్గులు కనిపించి చివరకు రెండు సూచీలు గ్రీన్ మార్క్‌లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 32.02 పాయింట్లు (0.05 శాతం) స్వల్ప లాభంతో 60,718.71 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 6.70 పాయింట్లు లాభపడి (0.04 శాతం) 18,109.45 వద్ద ముగిసింది.

click me!

Recommended Stories