బంగారం, వెండి ధరల పరుగులు.. నేడు హైదరాబాద్ లో 10గ్రా., పసిడి ధర ఎంత పెరిగిందంటే ?

First Published Nov 16, 2021, 11:24 AM IST

పండుగల సీజన్‌లో బంగారం(gold), వెండి(silver) ధరలు వేగంగా మారుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు పసిడి కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తే మంచి అవకాశం. దీపావళి (diwali)రోజున బంగారం అమ్మకాలు జోరుగా సాగాయని నిపుణులు చెబుతున్నారు. పండగ సీజన్ అయిపోయి ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. 

దీంతో పెరిగిన డిమాండ్ నుండి బంగారం, వెండి ధరలకు మద్దతు లభిస్తుంది. బంగారం మరోసారి నెమ్మదిగా 10 గ్రాముల ధర రూ.50,000 వైపు కదులుతోంది.

 నేడు మంగళవారం బంగారం ధర మళ్లీ  ఎగిసింది. ఈ రోజు ఎం‌సి‌ఎక్స్ లో బంగారం ధర 0.25 శాతం పెరిగింది. ఈ పెరుగుదల తర్వాత బంగారం ధర పది గ్రాములకు రూ.49,420కి చేరుకుంది. అంతకుముందు రోజు పది గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.49,132. ఈరోజు బంగారంతో పాటు వెండి కూడా పెరిగింది. దీని ధర 0.57 శాతం పెరిగింది. ఈ పెంపుతో కిలో వెండి ధర రూ.66,940కి చేరింది. క్రితం రోజు సిల్వర్  ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో కిలో వెండి రూ.66,613 వద్ద ట్రేడైంది. దేశంలో ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్ను, మేకింగ్ ఛార్జీల కారణంగా బంగారం ధర మారుతుందని గుర్తుంచుకోవాలి.

ఈ విధంగా బంగారం స్వచ్ఛతను తెలుసుకోండి
ఎక్కువగా 22 క్యారెట్ల బంగారం మాత్రమే నగల తయారీకి ఉపయోగిస్తారు. కొంతమంది 18 క్యారెట్ల బంగారాన్ని కూడా ఉపయోగిస్తారు. ఆభరణాలపై క్యారెట్‌ను బట్టి హాల్‌ మార్క్‌ను ముద్రిస్తారు. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని ఉంటుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.48,240గా ట్రేడవుతుండగా, ముంబైలో   పసుపు లోహం రూ.47,920గా ఉంది. కోల్‌కతాలో 10 గ్రాముల బంగారం ధర రూ.48,690 ఉండగా, చెన్నైలో  22 క్యారెట్ల బంగారం నేడు రూ.46,300గా ఉంది.

నివేదిక ప్రకారం ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,920 ఉండగా, న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,610గా ట్రేడవుతోంది. చెన్నైలో పసిడి ధర రూ. 50,510 కాగా, కోల్‌కతాలో ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,390కి అమ్ముడవుతోంది.

ఇతర నగరాలను పరిశీలిస్తే, లక్నో  ఇంకా పాట్నాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మార్కెట్ ధర వరుసగా రూ.49,690, రూ.50,840గా ఉంది. అలాగే, ఈ రెండు నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,690, రూ.47,510గా ఉంది.

తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.50,060కి అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,890గా ఉంది.

మీ నగరంలో బంగారం, వెండి ధరలను ఇలా తెలుసుకోండి
ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, మేకింగ్ ఛార్జీల కారణంగా దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాల ధరలు మారుతూ ఉంటాయి. మీరు మీ నగరంలో బంగారం ధరను మొబైల్‌లో కూడా తనిఖీ చేయవచ్చు. ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం మీరు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ధరలను తనిఖీ చేయవచ్చు. మీరు మెసేజ్ చేసిన నంబర్‌కు మెసేజ్ వస్తుంది. ఈ విధంగా ఇంట్లో కూర్చున్న బంగారం తాజా ధర మీకు తెలుస్తుంది.

బంగారం మార్కెట్‌
కరోనావైరస్ కేసులు పెరిగిన తర్వాత లాక్ డౌన్ కారణంగా చాలా వరకు ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. రియల్ ఎస్టేట్ సహా పలు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీంతో బంగారం మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావం పడింది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. జి‌ఎస్‌టి లేదా సేవా పన్ను బంగారం కొనుగోలు విషయంలో స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంది.

ఆయా రాష్ట్రాలు విధించే సర్వీస్ ట్యాక్స్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో బంగారం ధరలు మారే అవకాశం ఉంది. గత రెండు నెలలుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఆభరణాల షోరూమ్‌లో, కొన్ని రాష్ట్రాల్లో కొంచెం ఎక్కువగా తక్కువగా ఉండవచ్చు.

click me!