వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీ: అమెరికాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా మారిన చైనా..

First Published Nov 16, 2021, 3:17 PM IST

ఇప్పటి వరకు సంపదలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా(america) ఇప్పుడు అమెరికా నుంచి ఆ ట్యాగ్‌ని చైనా(china) లాగేసుకుంది. అవును, చైనా ఇప్పుడు సంపద పరంగా ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా మారింది. రెండు దశాబ్దాల వ్యవధిలోనే అమెరికాను వెనక్కి నెట్టి చైనా అగ్రస్థానానికి చేరుకుంది.

ప్రపంచ సంపద మూడింతలు 
 ప్రపంచ సంపద  గత రెండు దశాబ్దాలలో మూడు రెట్లు పెరిగింది. చైనా అమెరికా (యుఎస్‌)ని అధిగమించి ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానాన్ని ఆక్రమించింది. దీనికి సంబంధించి విడుదలైన నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని మొత్తం సంపదలో దాదాపు మూడోవంతు చైనా వద్ద ఉంది. 
 

చైనా ఆర్థిక వృద్ధిలో బలమైన వృద్ధి
డబల్యూ‌టి‌ఓలో చేరడానికి ఒక సంవత్సరం ముందు 2000 సంవత్సరంలో చైనా సంపద కేవలం 7 ట్రిలియన్ డాలర్లు మాత్రమే, ఇప్పుడు  $120 ట్రిలియన్లకు పెరిగింది. నివేదిక ప్రకారం, చైనా ఆర్థిక వృద్ధి క్రమంగా ఊపందుకుంది. 20 ఏళ్ల కాలంలో ప్రపంచ సంపదలో మూడో వంతు చైనాదే.

10 దేశాలపై దృష్టి 
ప్రపంచ ఆదాయంలో 60 శాతానికి బాధ్యత వహిస్తున్న 10 దేశాల బ్యాలెన్స్ షీట్లను ట్రాక్ చేసే మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ మెకిన్సే & కంపెనీ పరిశోధన విభాగం నివేదికలో ఈ విషయం వెల్లడైంది. నిజానికి, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ మెకిన్సే ప్రపంచ ఆదాయంలో 60 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న పది దేశాల జాతీయ బ్యాలెన్స్ షీట్‌లను పరిశీలిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం జ్యూరిచ్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం సంపద 2000లో $156 ట్రిలియన్ల నుండి 2020 సంవత్సరంలో $514 ట్రిలియన్లకు పెరిగిందని నివేదిక పేర్కొంది.

అమెరికా పతనానికి ఇదే కారణం
అమెరికా సంపదలో కూడా భారీగా పెరుగుదల ఉంది. అయితే అమెరికా సంపద గత 20 ఏళ్లలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. 2000 సంవత్సరంలో యూ‌ఎస్ సంపద $90 ట్రిలియన్లు. ఇక్కడ ప్రాపర్టీ ధరలు పెద్దగా పెరగకపోవడం వల్ల అమెరికా ఆస్తులు చైనా కంటే తక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. అమెరికా నంబర్ వన్ స్థానం నుంచి జారిపోవడానికి ఇదే కారణం.. ఇప్పుడు ఈ టైటిల్ చైనాకు చేరింది. 

click me!