నేడు లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్.. కలిసొచ్చిన జి‌ఎస్‌టి కలెక్షన్లు, దేశ వృద్ధి రేటు..

First Published Dec 1, 2021, 5:07 PM IST

నేడు  బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ (stock market)లాభాలతో ముగిసింది. విశేషం ఏంటంటే ఈ రోజు ట్రేడింగ్ ముగిసే వరకు ప్రారంభ లాభాలు కొనసాగాయి. ఈ కారణంగా బి‌ఎస్‌ఈ సెన్సెక్స్ (sensex)619.92 పాయింట్లు లేదా 1.09 శాతం లాభంతో 57,684.79 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ  నిఫ్టీ(nifty) 183.70 పాయింట్లు లేదా 1.08 శాతం లాభంతో 17,166.90 వద్ద ముగిసింది.

ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు జోరును కొనసాగించాయి. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా పడిపోయిన మార్కెట్లు దేశ వృద్ధి రేటు అంచనాలు సానుకూలంగా ఉండటంతో తిరిగి వేగంగా పుంజుకున్నాయి. జీఎస్టీ వసూళ్లు రూ.1.31,526గా నమోదు కావడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు అంచనాలకు మించి 8.4 శాతంగా నమోదు కావడం భాగ కలిసి వచ్చింది. ఇందులో CGST రూ. 23,978 కోట్లు, SGST రూ. 31,127 కోట్లు, IGST రూ. 66,815 కోట్లు దీంతో పాటు సెస్ ఉన్నాయి.   

2020 నవంబర్ నెలలో జిఎస్టి ఆదాయం 2019 నవంబర్ పోలిస్తే అధికంగా ఉంది. CGST అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్, SGST అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అలాగే IGST అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్. వస్తు సేవల పన్ను (GST) జూలై 2017లో అమలు చేశారు.

సెన్సెక్స్, నిఫ్టీలు పటిష్టంగా ప్రారంభం
ఈ సంవత్సరం చివరి నెల డిసెంబర్  మొదటి రోజున స్టాక్ మార్కెట్ మరోసారి  రిఔన్స్ అయ్యింది. మంగళవారం నాటి క్షీణతను ఛేదిస్తూ సెన్సెక్స్ 300.98 పాయింట్లు లేదా 0.53 శాతం లాభంతో 57,365.85 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 121.20 పాయింట్లు లేదా 0.71 శాతం లాభంతో 17,104.40 వద్ద ప్రారంభమయ్యాయి.

మంగళవారం ముగిసిన చివరి ట్రేడింగ్ రోజున స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. మరోవైపు రోజంతా ట్రేడింగ్‌లో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బిఎస్‌ఇ సెన్సెక్స్ 195.71 పాయింట్లు లేదా 0.36 శాతం క్షీణించి 57,064.87 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 17 వేల స్థాయికి దిగువన 16,983.20 వద్ద ముగిసింది. 

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.91 వద్ద ఉంది. నిఫ్టీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, జెఎస్ డబ్ల్యు స్టీల్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీగా లాభాలను పొందాయి. ఎక్కువగా నష్టపోయిన వాటిలో సీప్లా, దివిస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా ఉన్నాయి. ఫార్మా మినహా అన్ని ఇతర సెక్టోరల్ సూచీలు 2 శాతానికి పైగా లాభపడటంతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి.
 

click me!