పండగ వేళ స్టాక్ మార్కెట్ డీలా.. సెన్సెక్స్ 467 పతనం.. అదే బాటలో నిఫ్టీ..

First Published Jan 14, 2022, 11:16 AM IST

ప్రపంచ ప్రతికూల సంకేతాల మధ్య నేడు వారంలో చివరి ట్రేడింగ్ రోజున శుక్రవారం స్టాక్ మార్కెట్‌(stock market)లో ర్యాలీ ముగిసింది. సెన్సెక్స్(sensex), నిఫ్టీ (nifty)రెండు సూచీలు ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 190 పాయింట్లకు పైగా పడిపోయి ప్రారంభం కాగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 73 పాయింట్ల పతనంతో ట్రేడింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం సెన్సెక్స్ 467 పాయింట్ల పతనంతో 60,768 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 134 పాయింట్లు తగ్గి 18,200కి దిగజారి 18,123 వద్ద ట్రేడవుతోంది. 
 

ట్రేడింగ్ ప్రారంభంతో దాదాపు 909 షేర్లు లాభపడగా, 1151 షేర్లు క్షీణించాయి. అంతేకాకుండా 89 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. నిఫ్టీలో హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌సిఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, విప్రో, యుపిఎల్ ప్రధానంగా నష్టపోగా, సిప్లా, ఐఒసి, ఎల్ అండ్ టి, టైటాన్ కంపెనీ, దివీస్ ల్యాబ్స్ లాభపడ్డాయి. 

గురువారం స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో ట్రేడింగ్ రోజు బూమ్‌తో ముగియడం గమనార్హం. రోజంతా ఒడిదుడుకుల తర్వాత చివరికి మార్కెట్ సూచీలు రెండు స్వల్ప లాభాలతో గ్రీన్ మార్క్‌లో ముగిశాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 85 పాయింట్లు పెరిగి 61,235 వద్ద, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో 18,258 వద్ద ముగిశాయి.  

click me!