7th పే కమిషన్: రిటైర్మెంట్ చేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట, ఏ నిబంధనలను మార్చారో తెలుసుకోండి..

First Published Jan 13, 2022, 9:05 PM IST

పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం (central government)గొప్ప బహుమతి అందించింది. తాజాగా పదవీ విరమణ(retirement) చేస్తున్న ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు కాంపోజిట్ ట్రాన్స్‌ఫర్ గ్రాంట్(CTG) రూల్స్‌లో సవరణలు చేశారు.

 ఈ సవరణ ద్వారా లక్షలాది మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. దీనితో పాటు ఈ నిర్ణయం ప్రకారం పదవీ విరమణ చేసే ఉద్యోగి చివరి డ్యూటీ స్టేషన్‌లో లేదా 20 కిలోమీటర్ల కంటే లోపు దూరంలో స్థిరపడేందుకు కాంపోజిట్ ట్రాన్స్‌ఫర్ గ్రాంట్ (CTG) పరిమితిని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
 

డ్యూటీ చివరి స్టేషన్‌లో లేదా 20 కిలోమీటర్ల లోపు దూరంలో నివసించే ఉద్యోగులకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సి‌టి‌జి(CTG)లో మూడింట ఒక వంతు (గత నెల ప్రాథమిక జీతంలో 80 శాతం) చెల్లిస్తుంది. మరోవైపు, కేంద్ర ఉద్యోగి పదవీ విరమణ తర్వాత చివరి స్టేషన్‌ నుండి మరేదైనా ప్రదేశంలో స్థిరపడినట్లయితే ప్రభుత్వం దీనికి 100% సి‌టి‌జి ఇస్తుంది.

100% సి‌టి‌జి కోసం గ్రాంట్‌ను క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం నివాసం(resident) మార్పు తప్పనిసరి. అంతేకాకుండా మరొక ప్రదేశానికి మకాం మార్చే ఉద్యోగులు 100% సి‌టి‌జిని పొందవచ్చు, దీని వల్ల పదవీ విరమణ చేసే ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది. 

ఇప్పటి వరకు గత నెల బేసిక్ వేతనంలో 80 శాతం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం  సి‌టి‌జి జమ చేస్తుంది. అయితే, లక్షద్వీప్ ఇంకా అండమాన్-నికోబార్ వంటి ప్రదేశాలలో లేదా వెలుపల నివసిస్తున్న ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత ప్రాథమిక జీతంలో 100% చెల్లిస్తారు. 

ఏక్స్పెండీచర్ డిపార్ట్మెంట్  ప్రకారం, పదవీ విరమణ తర్వాత సి‌టి‌జి డ్యూటీ చివరి స్టేషన్‌లో లేదా 20 కి.మీ కంటే ఎక్కువ దూరంలో ఉండాలనే షరతును తొలగించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఫుల్ సి‌టి‌జి పదవీ విరమణ తర్వాత  కూడా అనుమతించబడుతుంది.

సి‌టి‌జి అనేది ప్రభుత్వం ఇచ్చే వన్-టైమ్ గ్రాంట్, దీని ద్వారా రిటైర్డ్ ఉద్యోగులను చివరి డ్యూటీ స్టేషన్ నుండి బదిలీ చేయడంలో సహాయపడుతుంది. దీన్ని క్లెయిమ్ చేయడానికి ఉద్యోగులు నివాస మార్పుకు సంబంధించి సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి, ఆ తర్వాత మాత్రమే క్లెయిమ్ చెల్లించబడుతుంది.

click me!