ఇంటిని అమ్మి క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి.. నేడు అంబానీనే అధిగమించి అత్యంత సంపన్నుడిగా..

First Published Jan 13, 2022, 7:24 PM IST

క్రిప్టోకరెన్సీ (cryptocurrency)మార్కెట్ ని చాలా అస్థిరమైన వ్యాపారంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇక్కడ పెట్టుబడిదారులు(investors) ఒక్కరోజులోనే సంపన్నులు కావొచ్చు లేదా క్షణల్లోనే కోలుకొని స్థాయికి పడిపోవచ్చు. క్రిప్టోకరెన్సీకి సంబంధించిన అద్భుతమైన సంఘటన ఒకటి నేడు వెలుగులోకి వచ్చింది. 

అదేంటంటే ఒక వ్యక్తి తన ఇంటిని అమ్మి క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టాడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు అతను ఆసియాలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. అవును.. ఇది నిజమే.. ఒక విధంగా చెప్పాలంటే సంపద విషయంలో ముఖేష్ అంబానీని అధిగమించాడు. అతనేవరో కాదు  బినాన్స్ సీఈవో చాంగ్‌పెంగ్ జావో.. అతని గురించి ఎంతో తెలుసుకుందాం...

క్రిప్టో ఎక్స్ఛేంజ్ బినాన్స్‌ను నిర్వహిస్తున్న చాంగ్‌పెంగ్ జావో 96.5 బిలియన్ల డాలర్ల నికర విలువతో ప్రపంచంలోని అగ్రశ్రేణి బిలియనీర్ల ర్యాంక్‌లో చేరారు. నివేదిక ప్రకారం, బుధవారం నాటికి చాంగ్‌పెంగ్ జావో  నికర విలువ 96.5 బిలియన్లు. అంటే బినాన్స్ సీఈఓ చాంగ్‌పెంగ్ జావో నికర విలువ ఇప్పుడు ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ కంటే తక్కువ మరోవైపు  సంపదలో ముఖేష్ అంబానీనే  అధిగమించాడు.

2017లో క్రిప్టో ఎక్స్ఛేంజ్ బినాన్స్ ప్రారంభం
ఒక నివేదిక ప్రకారం, చాంగ్‌పెంగ్  జావో ఒకసారి మెక్‌డొనాల్డ్స్‌లో బర్గర్ తయారీ బృందంలో పనిచేశాడు. నికర విలువ పరంగా, చాంగ్‌పెంగ్ జావో భారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీనే అదిగామీంచాడు. ప్రస్తుతం ముఖేష్ అంబానీ నికర విలువ దాదాపు 93.9 బిలియన్ డాలర్లు. చాంగ్‌పెంగ్ జావో 2017లో క్రిప్టో ఎక్స్ఛేంజ్ బినాన్స్‌ను ప్రారంభించారు. దీని కోసం అతను తన ఇంటిని కూడా విక్రయించాడు తరువాత దాని నుండి వచ్చిన డబ్బును క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టాడు. నివేదిక ప్రకారం, జావో బినాన్స్‌లో 90 శాతం వాటా ఉంది అలాగే 2021లో బినాన్స్  20 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది.

C-Z అని కూడా అంటారు
క్రిప్టో ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని బినాన్స్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మీరు నేడు విన్న బినాన్స్ విలువ   మరుసటి రోజుకు భిన్నంగా ఉంటుంది. క్రిప్టోఫైల్స్ ప్రపంచంలో చాంగ్‌పెంగ్  జావోను C Z అని కూడా పిలుస్తారు. నివేదిక ప్రకారం, అతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇంకా అతనికి అబుదాబిలోని రాజకుటుంబంతో కూడా సంబంధాలు ఉన్నాయి, నివేదిక ప్రకారం దుబాయ్‌లో ఒక అపార్ట్‌మెంట్‌ని కూడా అతను కొనుగోలు చేసారు అలాగే  బినాన్స్ ఎక్స్ఛేంజ్ ని భారతదేశానికి తీసుకురావాలని చూస్తున్నారు. అయితే, ఈ విషయంలో బినాన్స్ నుండి ఎటువంటి స్పందన లేదు.

click me!