లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌.. ఐ‌ఆర్‌సి‌టి‌సి షేర్లలో బలమైన జంప్.. సరికొత్త ఎత్తుకు దేశీ సూచీలు..

First Published Sep 14, 2021, 5:42 PM IST

నేడు దేశీయ స్టాక్ మార్కెట్ రెండవ రోజున మంగళవారం రోజంతా హెచ్చు తగ్గులు తర్వాత లాభాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 69.33 పాయింట్ల లాభంతో (0.12 శాతం) 58,247.09 వద్ద ముగిసింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 24.70 పాయింట్ల (0.14 శాతం) లాభంతో 17,380.00 వద్ద ముగిసింది. గత వారం 30-షేర్ల బి‌ఎస్‌ఈ సెన్సెక్స్ 175.12 పాయింట్లు (0.30 శాతం) పెరిగింది.

 గత కొన్ని రోజులుగా ఐఆర్‌సిటిసి స్టాక్‌లో బలమైన పెరుగుదల నమోదైంది. భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) స్టాక్ ఐదు శాతం లాభంతో ముగిసింది. ఒక విధంగా  పెట్టుబడిదారులకు చాలా ప్రయోజనం చేకూర్చింది. గత ఒక నెలలో ఐఆర్‌సిటిసి స్టాక్ 1000 పెరిగింది. అవెన్యూ సూపర్ మార్ట్ షేర్ కూడా ఊపందుకుంది కేవలం ఒక నెలలో రూ .500 పెరిగింది. ఐఆర్‌సిటిసి షేర్ 5,100 స్థాయికి చేరుకుంటుందని అంచనా. ఐఆర్‌సిటిసి మార్కెట్ పరంగా టాప్ 100 కంపెనీల్లోకి ప్రవేశించింది. కేవలం ఒక సంవత్సరంలో ఐఆర్‌సిటిసి స్టాక్ మూడు రెట్లు లాభాన్ని ఇచ్చింది. ఈ రోజు బి‌ఎస్‌ఈ లో 300.90 పాయింట్లు (+8.76 శాతం) పెరిగి 3737.15 వద్ద ముగిసింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .59,794.40 కోట్లు.

ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో మరో రెండు రసాయన తయారీదారు అమీ ఆర్గానిక్స్, హెల్త్‌కేర్ చైన్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ షేర్లు లిస్ట్ అయ్యాయి. అమీ ఆర్గానిక్స్ షేర్లు రూ. 610 ఇష్యూ ధరతో కలిపి దాదాపు 48 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. ఒక విధంగా బి‌ఎస్‌ఈ లో రూ .902 వద్ద ప్రారంభమైంది. విజయ డయాగ్నోస్టిక్స్ స్టాక్  రెండు శాతం ప్రీమియంతో 542.30 వద్ద జాబితా అయ్యింది.
 

జోమాటో  సి‌ఓ‌ఓ రాజీనామా, కంపెనీ స్టాక్ స్వల్పంగా పెరుగుదల

డెలివరీ కాకుండా వివిధ రెస్టారెంట్‌ల మెనూలను అందించే జోమాటో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సి‌ఓ‌ఓ) గౌరవ్ గుప్తా రాజీనామా చేసిన సంగతి మీకు తెలిసిందే. అతను 2015లో జోమాటో కంపెనీలో చేరాడు తరువాత 2018లో సి‌ఓ‌ఓ అయ్యాడు. తాజాగా కిరాణా వస్తువుల డెలివరీని నిలిపివేయాలని జోమాటో నిర్ణయించిన విషయం తెలిసిందే. దీని తరువాత ఈ రోజు బి‌ఎస్‌ఈ లో జోమాటో స్టాక్ 0.63 శాతం అధికంగా 144.10 వద్ద ముగిసింది. ప్రారంభ ట్రేడ్‌లో  145.25 స్థాయిలో ప్రారంభమైంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .1,12,892.14 కోట్లు.  
 

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నాలుగు శాతం లాభాలతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఆటో, ఎల్‌ అండ్‌ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రాలు ఉన్నాయి.  నెస్టల్‌ ఇండియా, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయాయి.
 
 నేడు మెటల్, ఎఫ్ఎంసిజి, ఫైనాన్స్ సర్వీసులు ఎరుపు మార్క్ తో  ముగిసింది. మరోవైపు, మీడియా, ఐటి, ఆటో, బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, పిఎస్‌యు బ్యాంక్, ఫార్మా, రియల్టీ గ్రీన్ మార్క్‌లో ముగిశాయి.

స్టాక్ మార్కెట్ ప్రారంభంలో నేడు  లాభాలతో  ప్రారంభమైంది. సెన్సెక్స్ 249.89 పాయింట్ల (0.43 శాతం) లాభంతో 58427.65 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 54.70 పాయింట్ల (0.32 శాతం) లాభంతో 17410 స్థాయిలో ప్రారంభమైంది.

సెన్సెక్స్-నిఫ్టీ సోమవారం రెడ్ మార్క్‌లో ముగిసింది. ట్రేడింగ్ ముగింపులో సెన్సెక్స్ 127.31 పాయింట్లు (0.22 శాతం) క్షీణించి 58,177.76 వద్ద ముగిసింది.  నిఫ్టీ 13.95 పాయింట్లు (0.08 శాతం) బలహీనపడి 17,355.30 స్థాయికి చేరుకుంది.

click me!