టి-సిరీస్‌తో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ భారీ డీల్.. త్వరలో వెయ్యి కోట్ల పెట్టుబడితో 10 సినిమాలు..

First Published Sep 13, 2021, 7:17 PM IST

హాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో భాగస్వామిగా పనిచేసిన దేశంలోని ప్రఖ్యాత సినిమా నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్  డ్రీమ్‌వర్క్స్ స్టూడియో అండ్ ఆంబ్లిన్ పార్ట్ నర్స్ తరువాత ఇప్పుడు హిందీ సినిమా దిగ్గజం టి-సిరీస్‌తో చేతులు కలిపింది.

 రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, టి-సిరీస్‌ కలిసి  10 సినిమాలు చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ సినిమాల నిర్మాణానికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి అంగీకరించాయి. ఈ 10 సినిమాలు ఎవరు, వాటిలో ఏ స్టార్లు ఉంటారనేది ఇంకా వెల్లడించలేదు కానీ  హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ నటించిన దక్షిణ భారతదేశపు హిట్ చిత్రం 'విక్రమ్‌వేధ'  హిందీ రీమేక్‌తో ప్రారంభమవుతుందని తెలుస్తుంది.

టి-సిరీస్ కంపెనీ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌లు మ్యూజిక్ మార్కెటింగ్ కోసం సుదీర్ఘ భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ భాగస్వామ్యం కింద రెండు కంపెనీలు దాదాపు 100 సినిమాలకు పనిచేశాయి. కానీ, ముంబైకి చెందిన రెండు పెద్ద స్టూడియోలు కలిసి సినిమాలు చేయాలని నిర్ణయించుకోవడం ఇదే మొదటిసారి. దీని కింద ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను రూపొందించడానికి  ప్రణాళికపై పనులు ప్రారంభమయ్యాయి.

దీని గురించి అందిన సమాచారం ప్రకారం ఈ 10 సినిమాలలో మూడు మెగా బడ్జెట్ చిత్రాలు ఉండనున్నాయి. అగ్ర తారలు, టెక్నిషియన్స్  ఈ చిత్రాలలో పని చేస్తున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ టి-సిరీస్ ఈ 10 చిత్రాలలో నిర్మాణంలో ఉన్న కొన్ని చిత్రాలు కూడా చేర్చయి. ఈ భాగస్వామ్య ప్రకటనతో వెల్లడించిన చిత్రాలలో తమిళ బ్లాక్ బస్టర్ హిందీ రీమేక్, ఒక చారిత్రక బయోపిక్, ఒక గూఢచారి థ్రిల్లర్, ఒక కోర్టు రూమ్ డ్రామా, ఒక సటైరికల్ కామిడీ చిత్రం, ఒక రొమాంటిక్ డ్రామా, రియాలిటీ బేస్డ్ ఫిల్మ్ ఉన్నాయి. 

 రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో పుష్కర్ అండ్ గాయత్రి, విక్రమ్‌జిత్ సింగ్, మంగేష్ హడావాలే, శ్రీజిత్ ముఖర్జీ, సంకల్ప్ రెడ్డి వంటి వారు నిర్మించే చిత్రాలకు సంబంధించిన దర్శకుల పేర్లు. ఇటీవలి సంవత్సరాలలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ గతంలో రోహిత్ శెట్టి, ఇంతియాజ్ అలీ, నీరజ్ పాండే, వికాస్ బహల్, విక్రమాదిత్య మోత్వానే, అనురాగ్ కశ్యప్, రిభు దాస్‌గుప్తా మొదలైన వారి భాగస్వామ్యంతో సినిమాలు నిర్మించింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో దాదాపు 300 ప్రముఖ చిత్రాలు ఉన్నాయి. సోమవారం ప్రకటించిన 10 సినిమాల్లో నాలుగైదు చిత్రాలు వచ్చే ఏడాది నాటికి విడుదలకు సిద్ధంగా ఉండవచ్చు.

రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూప్ సిఇఒ శిబాసిష్ సర్కార్ దీని గురించి మాట్లాడుతూ "టి-సిరీస్‌తో ఈ భాగస్వామ్యం గురించి నేను చాలా ఆశాజనకంగా ఉన్నాను. ఇది భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కొత్త వేడుకకు నాంది పలికింది.  అదే సంకల్పంతో మేము త్వరలో ఆఫ్‌బీట్ అండ్ స్పెషల్ మూమెంట్ సినిమాలతో రాబోతున్నాము అని అన్నారు.

click me!