పండుగ సీజన్లో బంగారం కొనేవారికి శుభవార్త.. తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..

First Published Sep 14, 2021, 11:56 AM IST

 గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్ ధర నేడు తగ్గింది. ఎం‌సి‌ఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.1 శాతం తగ్గి రూ. 46860 కి చేరుకుంది. గత నాలుగు ట్రేడింగ్ రోజుల్లో గోల్డ్ ఫ్యూచర్స్ మూడుసార్లు చౌకగా మారాయి. వెండి కిలోకు 0.23 శాతం తగ్గి రూ. 63155 కి చేరుకుంది. 

గత సంవత్సరం పసిడి ధర గరిష్ట స్థాయి 10 గ్రాములకు రూ. 56,200 నుండి బంగారం ఇప్పటికీ రూ .9,340 తగ్గింది. ఆగస్టులో బంగారం దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారతదేశంలో భౌతిక బంగారం డిమాండ్ బలహీనంగా ఉంది. దేశీయ డీలర్లు రాబోయే పండుగ సీజన్‌లో ఎక్కువ మంది కస్టమర్‌లు వస్తారని భావిస్తున్నారు.

డాలర్ ఇండెక్స్ రెండు వారాల గరిష్ట స్థాయికి దగ్గరగా నిలకడగా ఉన్నందున నేడు అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర పడిపోయింది.  ప్రపంచ మార్కెట్లలో స్పాట్ బంగారం ఈ రోజు  ఔన్స్ 0.1 శాతం తగ్గి 1,791.16 డాలర్లకు చేరుకుంది. ఇతర విలువైన లోహాలలో వెండి 0.3 శాతం తగ్గి ఔన్స్ కి  23.65 డాలర్ల వద్ద, ప్లాటినం 0.2 శాతం తగ్గి 958.73 డాలర్ల వద్ద ఉన్నాయి. 
 

బంగారం ధర ఆధారంగా గోల్డ్ ఇటిఎఫ్‌లు

ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ -బేస్డ్ ఎక్స్‌ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ లేదా గోల్డ్ ఇటిఎఫ్ అయిన ఎస్‌పిడిఆర్ గోల్డ్ ట్రస్ట్ హోల్డింగ్స్ సోమవారం 998.17 టన్నులకు గాను 0.2 శాతం పెరిగి 1,000.21 టన్నులకు చేరుకుంది. గోల్డ్ ఇటిఎఫ్‌లు బంగారం ధరపై ఆధారపడి ఉంటాయి. పసిడి ధరలో హెచ్చుతగ్గులపై దాని ధర కూడా హెచ్చుతగ్గులకు లోనవుతుంది. బంగారంపై బలహీన పెట్టుబడిదారుల ఆసక్తిని ఇటిఎఫ్ ప్రవాహాలు ప్రతిబింబిస్తాయని గమనించాలి. బలమైన కరెన్సీ ఇతర కరెన్సీల హోల్డర్లకు బంగారాన్ని మరింత ఖరీదైనదిగా చేస్తుంది.

డెల్టా వేరియంట్ వ్యాప్తి గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య వ్యాపారులు, పెట్టుబడిదారులు జాగ్రత్త వహిస్తున్నారు. అసమాన ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, డాలర్‌తో రూపాయి మారకం అస్థిరత విలువైన లోహం బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. 

హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర 10 గ్రాముల 24 క్యారెట్లకు రూ.47,990 వద్దనే కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,990 వద్ద ఉంది. దీంతో కేజీ వెండి ధర రూ.67,800కు దిగొచ్చింది.

ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు బంగారం రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సమాచారం ప్రకారం భారతదేశంలో గత సంవత్సంర బంగారం డిమాండ్ తగ్గుముఖం పట్టింది. అయితే, ఒకానోక సందర్భంలో బంగారం వినియోగం పరంగా చైనాని కూడా భారత్ అధిగమించింది. నిజానికి, భారతదేశంలో ఆభరణాల డిమాండ్ తగ్గి బంగారం డిమాండ్ గత కొన్ని సంవత్సరాలలో గణనీయంగా పెరిగింది.

గోల్డ్ ట్రేడింగ్ చేయాలంటే మీరు బ్యాంక్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్‌ను కలిగివుండాలి. స్టాక్ ట్రేడింగ్‌ను ఆఫర్ చేస్తున్న దాదాపు అన్ని బ్రోకరేజీ సంస్థలూ గోల్డ్ ట్రేడింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. కాని వీటిల్లో కూడా కమోడిటీ ట్రేడింగ్‌కు ప్రత్యేకంగా నమోదు చేసుకుంటేనే గోల్డ్ ట్రేడింగ్ చేయగలుగుతారు.

భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు

న్యూఢిల్లీ  22 క్యారెట్ల బంగారం ధర రూ.46,140,  24 క్యారెట్ల బంగారం ధర రూ.50,340
చెన్నై 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,350, 24 క్యారెట్ల బంగారం ధర  రూ.48,380
ముంబయి 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000, 24 క్యారెట్ల బంగారం ధర  రూ.47,000
కోల్ కత్తా 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550, 24 క్యారెట్ల బంగారం ధర  రూ.49,250
హైదరాబాద్ 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,990, 24 క్యారెట్ల బంగారం ధర  రూ.47,990

click me!