పెట్టుబడి, లాభాలు:
అరటిపండు పొడి చేయడానికి కావలసిన ముడి సరుకులకు దాదాపు 50 వేల నుంచి 1 లక్ష వరకు పెట్టుబడి కావాలి. యంత్రాలు, సెటప్‌కు గరిష్టంగా 3 నుంచి 5 లక్షల వరకు కావాలి. అనుమతులు, ఇతర ఖర్చులకు 50 వేల రూపాయలు, మార్కెటింగ్, బ్రాండింగ్‌కు 1 లక్ష రూపాయలు కావాలి. మొత్తం మీద 5 నుంచి 7 లక్షల రూపాయలలో వ్యాపారం మొదలు పెట్టవచ్చు. మొదట్లో చిన్న యంత్రాలతో మొదలు పెడితే కేవలం 2 లక్షల రూపాయలలో కూడా వ్యాపారం మొదలు పెట్టవచ్చు.
మార్కెట్‌లో అరటిపండు పొడి ధర 200 నుంచి 500 రూపాయల వరకు ఉంది. 1 కేజీ అరటిపండు పొడి చేయడానికి 8 నుంచి 10 కేజీల అరటిపండు కావాలి. కనీసం 50 నుంచి 60% లాభం వస్తుంది. అంటే నెలకు 1 లక్ష రూపాయల వరకు లాభం పొందవచ్చు.