ఇలా చేస్తే IRCTC Tatkal టిక్కెట్స్ కన్ఫర్ గా బుక్ అవుతాయి

First Published | Sep 17, 2024, 3:58 PM IST

రైల్వే తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఓ యుద్ధం లాంటిదే. టిక్కెట్లు బుక్ చేసుకొనేటప్పుడు మనం పడే టెన్షన్ మామూలుగా ఉండదు. అయితే ఈ కంగారులోనే తప్పులు కూడా చేసేస్తాం. మళ్లీ టిక్కెట్ కాన్సిలేషన్ చాలా తలనొప్పి ప్రాసెస్ కదా.. మీరు తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి. ప్రశాంతంగా, కన్ఫర్మ్ గా టిక్కెట్లు పొందండి. 

స్పీడ్ గా ఉండాలి

IRCTCలో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు చాలా స్పీడ్ గా పనిచేయాలి. ఎందుకంటే బుకింగ్‌లు ప్రారంభమైన వెంటనే అందరూ ఫాస్ట్ గా టిక్కెట్లు బుక్ చేసేసుకుంటారు. అందువల్ల మీరు తత్కాల్ వెబ్‌సైట్‌ను ముందుగానే తెరిచి ఉంచండి. మీ వివరాలను త్వరగా నమోదు చేయండి. పేమెంట్ వెంటనే చేస్తే త్వరగా టిక్కెట్ బుక్ అవుతుంది. 

ఎక్కువ డివైజస్ ఉపయోగించండి

మీరు ఎక్కువ సంఖ్యలో టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే ఒక డివైజ్ నుంచి కాకుండా రెండు, మూడు డివైజస్ ఉపయోగించి టిక్కెట్లు బుక్ చేసుకోండి. అంటే ఒకే కంప్యూటర్ అయితే వేర్వేరు బ్రౌజర్‌లను ఉపయోగించండి. వేర్వేరు మొబైల్ ఫోన్‌లలో వేర్వేరు లాగిన్ IDలతో ఒకే చోట కూర్చొని టిక్కెట్లు బుక్ చేయండి. ఇలా చేయడం వల్ల కన్ఫర్మ్ టికెట్లు పొందడానికి ఛాన్సస్ ఎక్కువ ఉంటాయి. 

నెట్ బ్యాంకింగ్, UPI ఉపయోగించండి

తత్కాల్ టికెట్ బుకింగ్‌కు వేగం అవసరం. కాబట్టి మీరు ముందుగానే బుక్ చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే కన్ఫర్మ్ టికెట్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేగవంతమైన లావాదేవీల కోసం మొబైల్ వాలెట్‌లు, నెట్ బ్యాంకింగ్, UPI వంటి వేగవంతమైన చెల్లింపు ఎంపికలను ఉపయోగించండి. IRCTC వాలెట్‌ని ఉపయోగిస్తే మీ పేమెంట్ సేఫ్, సెక్యూర్ గా జరుగుతుంది. 

Latest Videos


పాసింజర్స్ డీటైల్స్ ముందుగానే సిద్ధం చేసుకోండి

తత్కాల్ బుకింగ్ ప్రాసెస్ ప్రారంభించే ముందే పాసింజర్స్ పేర్లు, వయస్సు, ఆధార్ నంబర్లు, ఇతర డిటైల్స్ దగ్గర పెట్టుకోండి. బుకింగ్ సమయంలో వేగంగా, వివరంగా డీటైల్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. 

ఇంటర్నెట్ కనెక్షన్‌ని స్పీడ్ గా ఉండాలి

తత్కాల్ టికెట్ బుకింగ్‌కు హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ చాలా ముఖ్యం. మీరు తత్కాల్ టిక్కెట్ బుక్ చేసేటప్పుడు నెట్ సిగ్నల్ ఎలా ఉందో ముందే చెక్ చేసుకోండి. లేదంటే పేమెంట్ టైమ్ లో మీరు ఇబ్బంది పడే అవకాశాలుంటాయి. అమౌంట్ కట్ అయిపోతుంది. టిక్కెట్ కన్ఫర్మ్ కాదు. ఇలా జరగకుండా నెట్ సిగ్నల్ బాగున్న నెట్ వర్క్ నే ఉపయోగించండి. 

బుకింగ్ ఏజెంట్ సహాయం

మీరు తత్కాల్ టిక్కెట్లను మీరే బుక్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారా? లాగ్వేజ్, టెక్నికల్ ఇబ్బందులు పడుతుంటే మీరు బుకింగ్ ఏజెంట్ సహాయం బెటర్. ఉదయం 10 గంటల నుండి AC కోచ్‌లు, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్లీపర్ కోచ్‌లను బుక్ చేసుకోవడానికి ఏజెంట్‌లు అందుబాటులో ఉంటారు. సహాయం కోసం సరైన సమయంలో వారిని సంప్రదించండి.

ప్రయాణానికి సరైన డేట్స్ సెలక్ట్ చేయండి

మీరు అత్యవసరంగా వెళ్లాల్సిన అవసరం లేనప్పుడు నార్మల్ డేస్ లో జర్నీ చేయడానికి ప్రయత్నించండి. చాలా మంది వీకెండ్స్ ప్లాన్ చేస్తారు. అందువల్ల తత్కాల్ టిక్కెట్లు కన్ఫర్మ్ గా దొరకడం కష్టమవుతుంది. మీ ప్రయాణం అర్జెంట్ కాకపోతే మామూలు రోజుల్లో ప్రయాణించడానికి ప్రయాణించండి. 

2 నిమిషాల ముందే లాగిన్ అవ్వండి

మీకు AC కోచ్‌ల కోసం తత్కాల్ టిక్కెట్లు కావాలా? అయితే మీ ప్రయాణానికి ఒక రోజు ముందు ఉదయం 10 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు టిక్కెట్లు దొరుకుతాయి. అయితే మీరు కొన్ని నిమిషాలు ముందుగానే లాగిన్ అవ్వాలి. సరిగ్గా ఉదయం 10 గంటలకు లాగిన్ అయితే ఉపయోగం ఉండకపోవచ్చు. కనీసం 2 నిమిషాల ముందు లాగిన్ అవ్వండి. అంటే 9:58 గంటలకు సైట్‌ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించండి.

నాన్-AC స్లీపర్ కోచ్‌ల కోసం..

నాన్-AC స్లీపర్ కోచ్‌ల తత్కాల్ టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి స్లాట్ ఉదయం 11 గంటలకు ఓపెన్ చేస్తారు.  బుకింగ్ ప్రారంభానికి 2-3 నిమిషాల ముందు లాగిన్ అవ్వడం వల్ల మీకు సర్వర్ సమస్య రాదు. టికెట్ కన్ఫర్మ్ గా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ టిప్స్ పాటిస్తే మీరు తప్పకుండా IRCTC తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోగలరు. 

click me!