SSY: నెల‌కు రూ. 500 పొదుపు చేస్తే రూ. 3 ల‌క్ష‌లు పొందొచ్చు.. వ‌డ్డీనే రూ. 2 ల‌క్ష‌లు

Published : May 18, 2025, 04:21 PM IST

సుకన్య సమృద్ధి యోజన: దేశంలోని ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ముఖ్యమైన పథకం. ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఆడపిల్లల చదువు లేదా వివాహం కోసం మంచి మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. నెలకు రూ. 500 పొదుపు చేయడం ద్వారా ఎంత మొత్తం పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
17
SSY: నెల‌కు రూ. 500 పొదుపు చేస్తే రూ. 3 ల‌క్ష‌లు పొందొచ్చు.. వ‌డ్డీనే రూ. 2 ల‌క్ష‌లు
బెస్ట్ స్కీమ్

ఆడ బిడ్డల చదువు లేదా వివాహ సమయానికి పెద్ద మొత్తంలో అమౌంట్ పొందాలనుకునే వారికి సుకన్య యోజన బెస్ట్ స్కీమ్ గా చెప్పొచ్చు. ఈ పథకంలో నచ్చిన మొత్తంలో పెట్టుబడి పెడుతూ వెళ్లొచ్చు. నెలకు రూ. 500 పెట్టుబడి పెడితే ఎంత రిటర్న్స్ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

 

27
సుకన్య సమృద్ధి పాలసీ గడువు ఎన్నేళ్ళు?

సుకన్య సమృద్ధి యోజన పథకానికి మెచ్యూరిటీ సమయం 21 ఏళ్లు ఉంటుంది. అయితే, అమ్మాయికి 18 ఏళ్లు వచ్చాక చదువు కోసం కొంత మొత్తంలో డబ్బు తీసుకోవచ్చు. పూర్తి మొత్తం తీసుకోవాలంటే మాత్రం 21 ఏళ్లు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 

37
సుకన్య సమృద్ధి ఖాతా ఎక్కడ తెరవాలి?

సుకన్య సమృద్ధి పాలసీ కింద పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో ఖాతా తెరవవచ్చు. దీనికి అమ్మాయి జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల గుర్తింపు కార్డు, చిరునామా రుజువు, పాన్ కార్డ్ అవసరం.

47
₹500 పెట్టుబడితో ఎంత లాభం?

ఉదాహరణకు మీరు ఈ పథకంలో నెలకు రూ. 500 పెట్టుబడి పెడుతూ వెళ్లారని అనుకుందాం. ఇలా మీరు 15 ఏళ్లు పెట్టుబడి పెడితే 15 ఏళ్లకు రూ. 90 వేలు జమ అవుతుంది. దీనిపై రూ. 1,87,103 వడ్డీ లభిస్తుంది. పథకం మెచ్యూరిటీ అనంతరం మీకు రూ.₹2,77,103 లభిస్తుంది. ఇలా మీరు వడ్డీ రూపంలోనే ఏకంగా సుమారు రూ. 2 ల‌క్ష‌లు సొంతం చేసుకోవచ్చు. 

57
₹1000 పెట్టుబడితో ఎంత లాభం?

ఒకవేళ మీరు ఈ పథకంలో నెలకు రూ. 1000 పెడితే 15 ఏళ్లలో ₹1.80 లక్షలు జమ అవుతుంది. దానిపై ₹3,74,206 వడ్డీ. మొత్తం ₹5,54,206 వస్తుంది.

67
SSYలో కనీస, గరిష్ట పెట్టుబడి ఎంత?

ఈ పథకంలో ఏటా కనీసం రూ. 250 పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్టంగా రూ. 1,50,000 వరకు పెట్టుబడి పెడుతూ వెళ్లొచ్చు. 

77
SSYలో ఎన్ని ఖాతాలు తెరవవచ్చు?

ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లలకు SSY ఖాతాలు తెరవవచ్చు. కవలలు ఉంటే ఎక్కువ ఖాతాలు తెరవవచ్చు. ₹1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories