Sovereign Gold Bond: బంగారం కొంటున్నారా అయితే డిస్కౌంట్ తో పాటు నెల నెల ఆదాయం కూడా మీ సొంతం...

Published : Aug 22, 2022, 05:14 PM IST

బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా, అయితే ఇది మీకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి ఎందుకంటే, నేటి నుంచి కేంద్ర ప్రభుత్వం సావరీన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు పథకానికి తెర లేపింది. 5 రోజుల పాటు అందుబాటులో ఉండే ఈ బాండ్ ద్వారా బంగారం ధర గ్రాముకు రూ.5,197గా నిర్ణయించారు

PREV
16
Sovereign Gold Bond: బంగారం కొంటున్నారా అయితే డిస్కౌంట్ తో పాటు నెల నెల ఆదాయం కూడా మీ సొంతం...

2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ రెండవ సిరీస్ సోమవారం నుండి ఐదు రోజుల పాటు అంటే నేటి నుంచి తెరిచి ఉంటుంది. ఈ పథకం కింద బంగారం కొనుగోలుపై మంచి డిస్కౌంట్ సైతం ఉంది. ఈ పథకంలో, ఎవరైనా పెట్టుబడిదారుడు బంగారాన్ని బాండ్ల రూపంలో కొనుగోలు చేయవచ్చు. ఈ బాండ్ ద్వారా బంగారం ధర గ్రాముకు రూ.5,197గా నిర్ణయించారు.

26

ఆన్‌లైన్ లేదా డిజిటల్‌లో గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసే పెట్టుబడిదారులకు, బాండ్ ధర గ్రాముకు రూ.50 తక్కువగా అందుబాటులో  ఉంటుందని ఆర్‌బిఐ తెలిపింది. ఆన్‌లైన్ పెట్టుబడిదారుల కోసం, గోల్డ్ బాండ్ ఇష్యూ ధర గ్రాముకు రూ. 5147గా నిర్ణయించారు. 
 

36

ప్రభుత్వం నవంబర్ 2015 నుండి సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని అమలు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2021-22లో, రిజర్వ్ బ్యాంక్ గోల్డ్ బాండ్ పథకాన్ని 10 విడతలుగా ప్రవేశపెట్టింది. ఇందులో మొత్తం రూ. 12,991 కోట్ల బంగారు బాండ్లను ఇప్పటి వరకూ జారీ చేశారు.
 

46

ఈ పథకం కింద,ఒక వ్యక్తిగత కొనుగోలుదారు కనీసం ఒక గ్రాము మరియు గరిష్టంగా నాలుగు కిలోగ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. HUF కోసం, ఈ పరిమితి 4 కిలోలుగానూ, ట్రస్ట్ ల కోసం ఈ పరిమితి 20 కిలోలుగా నిర్ణయించారు. ఈ బంగారు బాండ్లను భారత పౌరులు, హిందూ అవిభక్త కుటుంబాలు (HUFలు), ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలకు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. 
 

56

ఈ బాండ్‌పై లాంగ్ టర్మ్ ప్రాఫిట్ ట్యాక్స్ మినహాయింపు ఉంది. ఈ గోల్డ్ బాండ్ పథకంలో, పెట్టుబడిదారులు తమ డబ్బును ఐదవ సంవత్సరం నుండి విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, దాని మెచ్యూరిటీ వ్యవధిని ఎనిమిదేళ్లుగా ఉంచారు. 2015-16 సంవత్సరంలో గోల్డ్ బాండ్ పథకం మొదటి దశలో గ్రాము ధర రూ.2,684గా నిర్ణయించారు. ఎవరైనా మే 2021లో దాన్ని రీడీమ్ చేసి ఉంటే, ఆ సమయంలో బాండ్ ధర గ్రాముకు రూ. 4,837 ఉన్నందున అతనికి 80 శాతం లాభం వచ్చి ఉండేది.
 

66
Sovereign Gold Bond scheme opens Monday-Issue price

అంతేకాదు ఈ బంగారం బాండ్లపై సంవత్సరానికి 2.5 శాతం వడ్డీని చెల్లిస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్ డిజిటల్ రూపంలో ఉంటుంది. అందువల్ల భౌతిక బంగారం తరహాలో మీరు లాకర్లలో దాచుకోవాల్సిన పనిలేదు. మీరు బాండ్ పేపర్‌ను ఫైల్‌లో సులభంగా నిల్వ చేయవచ్చు. బాండ్లు డీమ్యాట్ రూపంలో ఉంటాయి. దీనివల్ల మీరు నష్టపోయే ప్రమాదం లేదు. సావరిన్ గోల్డ్ బాండ్లను మైనర్ పేరుతో సైతం తీసుకోవచ్చు. ఉదాహరణకు మీ అమ్మాయి పెళ్లి కోసం డబ్బు దాచాలనుకుంటే ఇది మంచి మార్గం, మీ అమ్మాయి పేరిట తల్లిదండ్రులు/సంరక్షకులు సావరిన్ గోల్డ్ బాండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు ఈ సావరిన్ గోల్డ్ బాండ్‌పై రుణం కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం గోల్డ్ బాండ్ తాకట్టు పెట్టాల్సి ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories