Fathers Property: తండ్రి సంపాదించిన ఆస్తి తనదే అనుకుంటాడు కొడుకు. కానీ తండ్రి సంపాదించిన ఆస్తిపై కొడుకుకు ఎలాంటి హక్కు ఉండదని, తండ్రి ఇస్తేనే తీసుకోవాలని చెప్పింది కోర్టు. తండ్రి సంపాదించిన ఇంట్లో కూడా అతని అనుమతితోనే కొడుకు ఉండాలని చెప్పింది.
తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తిపై కుమారుడికి ఎలాంటి హక్కు ఉండదని రాజస్థాన్ హైకోర్టు స్పష్టం చేసింది. తండ్రి ప్రేమతో కొడుకుని ఇంట్లో ఉండనిచ్చినంత మాత్రాన ఆ ఇంటిపై కుమారుడికి యాజమాన్యం వస్తుందని అనుకోవడం సరైంది కాదని కోర్టు తేల్చిచెప్పింది. పిల్లలు తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే ఇంట్లో ఉండగలరని, ఆ అనుమతి ఎప్పుడైనా వెనక్కు తీసుకునే హక్కు తండ్రికి ఉంటుందని కోర్టు పేర్కొంది.
24
ఆధారాలు అవసరం
ఒక కేసులో తండ్రి కొన్నేళ్ల క్రితం తాను కొనుకున్న స్థలంపై తన డబ్బుతోనే ఇల్లు కట్టాడు.కొడుకుకు పెళ్లి చేశాక ఉమ్మడి కుటుంబంగా అందరూ కలిసే ఉండేవారు. అయితే తర్వాత విభేదాలు రావడంతో కొడుకు కుటుంబాన్ని ఇంటి నుంచి వెళ్లమని చెప్పాడు. దీనితో కుమారుడు కోర్టుకెళ్లి ఈ ఇల్లు కుటుంబ ఆస్తి లో భాగమని, తాను కూడా సహయజమాని అని వాదించాడు. కానీ అతనికి దీనికి సంబంధించిన ఎలాంటి పత్రాలు, ఆధారాలు లేవు.
34
తండ్రి ఒప్పుకుంటేనే.. ఉండాలి
ట్రయల్ కోర్టు, అప్పీల్ కోర్టు.. రెండూ అతని వాదనలను తిరస్కరించాయి. చివరకు హైకోర్టులో విచారణ జరిగినప్పటికీ అక్కడ కూడా అదే తీర్పు వచ్చింది. తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తి ఆయన వ్యక్తిగత ఆస్తి. దాన్ని పిల్లలు తమ హక్కుగా చెప్పుకోలేరు. తండ్రి అనుమతి ఇస్తే ఇంట్లో ఉండవచ్చు. దీన్ని పెర్మిసివ్ ఆక్యుపేషన్ అంటారు. అంత మాత్రాన కొడుకు యజమాని అయిపోడు. కుటుంబ ఆస్తి అని చెప్పాలంటే స్పష్టమైన ఆధారాలు తప్పనిసరిగా ఉండాలని కోర్టు చెప్పింది.
ఈ తీర్పుతో కుటుంబాల్లో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే ఆస్తి గొడవలకు స్పష్టమైన మెసేజ్ వెళ్లింది. తల్లిదండ్రుల సంపాదనపై పిల్లలకు స్వయంగా ఎలాంటి హక్కు ఉండదు. ప్రేమతో, అనుబంధంతో ఇంట్లో ఉండనివ్వడం వల్ల ఆ ఆస్తిపై భాగస్వామ్యం ఏర్పడదు. తండ్రి తన ఆస్తిని ఎలా ఉపయోగించాలన్నా, ఎవరికి ఇవ్వాలన్నా, ఎవరిని ఇంట్లో ఉంచాలన్నా అది పూర్తిగా ఆయన హక్కే అని ఈ తీర్పు మరోసారి గుర్తు చేసింది.