Solar Energy: వర్షాకాలంలో సోలార్ ప్యానెల్స్ పనిచేస్తాయా? సౌర విద్యుత్తు వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా?

Published : Jul 03, 2025, 03:54 PM IST

సోలార్ విద్యుత్తు ఉపయోగించాలంటే చాలా మందికి పెద్ద డౌట్ ఉంటుంది. ఎండాకాలంలో పర్లేదు కాని.. వానాకాలంలో వర్షాలు, మబ్బుల వల్ల విద్యుత్తు ప్రొడ్యూస్ అవ్వదని చాలా మంది అనుకుంటారు. ఇందులో నిజమెంత? సోలార్ విద్యుత్తు వినియోగం వల్ల ఉపయోగాలు ఇప్పుడు చూద్దాం. 

PREV
15
వర్షాకాలం సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందా?

సాధారణంగా సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తికి సూర్యకాంతి చాలా అవసరం. అయితే వర్షాకాలం సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని చాలా మంది అనుకుంటారు. తడిగా ఉన్న వాతావరణంలో సోలార్ ప్యానెల్స్ పనితీరు సరిగ్గా ఉండదని చాలా మంది అనుకుంటారు. ఈ విషయంపై నిపుణుల అభిప్రాయాలను, సలహాలను తెలుసుకుంటే సోలార్ విద్యుత్తు ఎలా పనిచేస్తుంది? దాని వల్ల ప్రయోజనాలు ఏమిటో తెలుస్తుంది. 

25
వర్షాకాలంలో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి ఆగిపోదు

వర్షాకాలంలో మబ్బులు పట్టిన వాతావరణ ఎక్కువగా ఉండటం వల్ల సూర్యుడు ఎక్కువగా కనిపించడు. ఎండ తీవ్రత కూడా తక్కువగానే ఉంటుంది. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్న వారి ఇంట్లో వర్షాకాలంలో పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి ఆగిపోదు. అవి కొన్ని ప్రమాణాల్లో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. మేఘావృతమైన ఆకాశం కారణంగా సూర్యకాంతి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ డిఫ్యూస్ సన్‌లైట్ ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. 

35
వాతావరణ పరిశోధన సంస్థ ఏం చెబుతోంది?

వాతావరణ పరిశోధన సంస్థ సమాచారం ప్రకారం వర్షాకాలంలో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం సాధారణంగా 10 నుంచి 25 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక సోలార్ ప్యానెల్ రోజుకు 5 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తే వర్షం కురిసిన రోజుల్లో అది 3.5 నుంచి 4.5 యూనిట్ల వరకు తగ్గవచ్చు.

45
శుభ్రంగా ఉంటే ఎక్కువ విద్యుత్తు

అలాగే వర్షాకాలంలో ప్యానెల్స్‌పై మట్టి, దుమ్ము తొలగిపోవడం ద్వారా కొన్ని సందర్భాల్లో పనితీరు మెరుగుపడే అవకాశమూ ఉంటుంది. క్లీన్ సర్ఫేస్ సౌరకాంతిని మెరుగ్గా గ్రహించగలదు. అయితే వరదలు, నీటి నిలిచిపోవడంలాంటి సమస్యల వల్ల ప్యానెల్ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది.

55
సోలార్ ప్యానల్స్ కి ఇలా రక్షణ కల్పించండి

సౌరశక్తి కంపెనీలు సూచిస్తున్నట్టు సోలార్ ప్యానెల్స్‌ సురక్షితంగా ఉపయోగించాలంటే నీరు చేరకుండా చూసుకోవాలి. వాటర్‌ప్రూఫ్ జంక్షన్ బాక్సులు, మెరుగైన మౌంటింగ్ స్ట్రక్చర్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సోలార్ ప్యానల్స్ సేఫ్ గా ఉంటాయి. 

ఎక్కువ వర్షాలు పడే ప్రాంతాల్లో గాలి, వర్షం ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యం ఉన్న ప్యానెల్స్‌ ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

నూతన టెక్నాలజీకి అనుగుణంగా కొన్ని ఆధునిక సోలార్ ప్యానెల్స్ వర్షాకాలంలో కూడా అధిక సామర్థ్యంతో పని చేయగలుగుతున్నాయి. దీనికి నిదర్శనంగా బెంగళూరు, హైదరాబాద్, గువాహటి వంటి ప్రాంతాల్లో సౌరశక్తి ప్రాజెక్టులు వర్షాకాలంలో 70 శాతం వరకు సామర్థ్యంతో పనిచేస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories