Business Idea: చింత గింజ‌ల‌తో ల‌క్ష‌ల్లో సంపాద‌న‌.. ఈ ఐడియా తెలిస్తే అస్స‌లు వ‌దిలిపెట్ట‌రు

Published : Jul 03, 2025, 03:41 PM ISTUpdated : Jul 03, 2025, 03:43 PM IST

వ్యాపారం చేయ‌డానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. అయితే అన్ని వ్యాపారాల‌కు డ‌బ్బుతో మాత్ర‌మే ప‌ని ఉండ‌దు. కొన్ని తెలివితేటలు కూడా ఉండాలి. తెలివితో ల‌క్ష‌లు సంపాదించే అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. 

PREV
15
చింత గింజ‌లే పెట్టుబ‌డి

సాధార‌ణంగా చింతగింజలు ప‌నికిరాని వాటిగా భావిస్తుంటాం. కానీ చింత గింజ‌ల నుంచి త‌యార‌య‌యే పౌడ‌ర్‌కి ఎంతో డిమాండ్ ఉంద‌న్న విష‌యం మీకు తెలుసా.? చింతగింజల పౌడ‌ర్‌ను ఇండస్ట్రియల్, ఆయుర్వేద, కోస్మెటిక్ రంగాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. 

చింత గింజ‌ల నుంచి వ‌చ్చే స్టార్చ్, పాలిష్, మల్టీగ్రేన్ పౌడర్ తయారీలో విరివిగా ఉప‌యోగిస్తారు. అందువల్ల దీనిని ఓ లాభదాయకమైన స్మాల్ స్కేల్ బిజినెస్‌గా అభివృద్ధి చేయవచ్చు.

25
వ్యాపారం ఎలా ప్రారంభించాలి.?

చింతగింజల పౌడర్ తయారీ మొదలుపెట్టాలంటే మొదట మీరు పరిశ్రమ కోసం స్థలాన్ని ఎంపిక చేయాలి. మొద‌ట చిన్న స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభించ‌వ‌చ్చు. ఈ వ్యాపారాన్ని మొద‌లు పెట్టాలంటే బిజినెస్ రిజిస్ట్రేషన్ (MSME/Udyam), GST నమోదు, FSSAI ఫుడ్ లైసెన్స్, బ్యాంకు లోన్ లేదా ప్రభుత్వ రుణ పథకాలు గురించి తెలుసుకోవాలి.

35
అవ‌స‌ర‌మైన మిష‌న‌రీ, మెటీరియ‌ల్స్

ఈ వ్యాపారం ప్రారంభించేందుకు కొన్ని ర‌కాల మిష‌న‌రీలు కావాలి. డీ హస్కింగ్ మెషిన్ - గింజ‌ల‌పై ఉండే పొట్టును తొల‌గించేది, పౌడరింగ్ మిషన్, డ్రైయింగ్ ట్రే/ఓవెన్, సీవింగ్ మెషిన్, ప్యాకింగ్ మెషిన్ కావాలి. అలాగే అన్నింటికంటే ముఖ్య‌మైంది ఎండిన చింతగింజలు.ఇవి మార్కెట్లో తక్కువ ధరకు టన్నుల కొద్ది లభిస్తాయి.

45
పెట్టుబడి ఎంత అవసరం? లాభాలు ఎలా ఉంటాయి.?

ఈ బిజినెస్‌ను చిన్న స్థాయిలో ప్రారంభించాలంటే. ప్రాథ‌మికంగా రూ. 50 వేల నుంచి రూ. ల‌క్ష వ‌ర‌కు పెట్టుబ‌డి కావాలి. సాధారణ స్థాయి యూనిట్ ఏర్పాటు చేయాలంటే రూ. 2 ల‌క్ష‌లు ఖ‌ర్చ‌వుతుంది. ఇక రా మెటీరియ‌ల్ ఖ‌ర్చు నెల‌కు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వ‌ర‌కు అవుతుంది. ప్యాకింగ్, మార్కెటింగ్ ఖర్చుల కోసం రూ. 10 వేల వ‌ర‌కు అవుతుంది.

ఒక కిలో చింతగింజల నుంచి సుమారు 600–700 గ్రాముల పొడి తయారవుతుంది. ఈ పౌడర్‌ను మార్కెట్‌లో రూ. 150 నుంచి రూ. 250 ధరకు విక్రయించవచ్చు. నెలకు కనీసం రూ. 40,000 నుంచి రూ. 60 వేల వ‌ర‌కు ఆదాయం పొందొచ్చు. ఇకామ‌ర్స్ లేదా సంస్థ‌ల ద్వారా నేరుగా ఒప్పందం చేసుకోవ‌డం వ‌ల్ల నెల‌కు రూ. ల‌క్ష‌ల్లో ఆదాయం పొందొచ్చు.

55
మార్కెటింగ్ టిప్స్

చింత గింజ‌ల పొడిని త‌యారు చేయ‌డంతో పాటు దానిని మార్కెటింగ్ చేసుకోవ‌డం అంతే ముఖ్యం. చింత గింజ‌ల పౌడ‌ర్‌కి ఆయుర్వేద ఔషధ సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్, స్థానిక ఆయుర్వేద దుకాణాల్లో గిరాకీ ఉంటుంది.

ప్ర‌స్తుతం మారిన టెక్నాల‌జీకి అనుగుణంగా సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌మోష‌న్ చేయొచ్చు. సొంతంగా బ్రాండ్ పేరుతో ప్యాకెట్లు చేసి విక్ర‌యించ‌వ‌చ్చు. అగ్రి ఎగ్జిబిషన్‌లు, ట్రేడ్ షోలలో పాల్గొన‌డం ద్వారా మార్కెటింగ్ చేసుకోవ‌చ్చు.

Read more Photos on
click me!

Recommended Stories