Software Engineer: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే లక్షల జీతాలు, విలాసవంతమైన జీవితం అని అందరూ అనుకుంటారు. కానీ ఆ "హై ప్యాకేజీ" వెనుక ఉన్న అసలు ఖర్చులు, పన్నులు, ఇతర ఆర్థిక సవాళ్ల గురించి ఎవరూ మాట్లాడరు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
సాఫ్ట్‌వేర్ రంగంలో అడుగుపెట్టే ప్రతి యువకుడి కల.. ఒక పెద్ద ప్యాకేజీ సాధించడం. అయితే, పేపర్ మీద కనిపించే అంకెలకు, నెలాఖరున బ్యాంక్ అకౌంట్‌లో మిగిలే బ్యాలెన్స్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకు సంబంధించిన నమ్మలేని నిజాలను ఒక టెక్కీ తన రోజువారీ జీవితంలోని ఆర్థిక వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు వివరించారు.
25
పన్నులు, డిడక్షన్స్:
ముందుగా, 20 లేదా 30 లక్షల ప్యాకేజీ అనగానే అది మొత్తం మన చేతికి రాదు. అందులో గణనీయమైన భాగం ఆదాయపు పన్ను, పిఎఫ్, ఇతర ప్రొఫెషనల్ ట్యాక్సుల రూపంలోనే కట్ అయిపోతుంది. కేవలం ఇన్-హ్యాండ్ శాలరీ చూసుకుంటే అది ప్యాకేజీలో చెప్పిన దానికంటే చాలా తక్కువగా ఉంటుంది.
35
మెట్రో సిటీలలో ఖర్చులు:
హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు అద్దెలే ప్రధాన శత్రువులు. ఆఫీస్‌కు దగ్గరగా ఉండాలంటే భారీగా అద్దెలు చెల్లించాల్సిందే. దీనికి తోడు ఫుడ్, ట్రాన్స్‌పోర్ట్, వారాంతపు వినోదాల ఖర్చులు కలపాల్సి వస్తుంది.
ఈ లెక్కన సగటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన జీతంలో 60 శాతం నుండి 70 శాతం కేవలం జీవించడానికి మాత్రమే ఖర్చు చేస్తున్నాడు. జీతం క్రెడిట్ అయిన వారం రోజులకే అకౌంట్ ఖాళీ అవ్వడం, మళ్ళీ వచ్చే నెల కోసం ఎదురుచూడటం.. ఇది నేటి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల దైనందిన జీవితంలోని ఒక భాగం
55
సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్ - నిజమైన విజయం
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అనేది బయటకు గ్లామరస్‌గా కనిపించినా, లోపల ఆర్థిక ప్రణాళిక లేకపోతే అది కేవలం ఒక చక్రబంధంలా మారుతుంది. ప్యాకేజీల కంటే పొదుపు చేయడం, తెలివిగా ఖర్చు చేయడం నేర్చుకున్నప్పుడే నిజమైన ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది.