Trading: స్ట్రాటజీ కాదు.. క్రమశిక్షణే మిమ్మల్ని కాపాడుతుంది.. ట్రేడింగ్ సక్సెస్ మంత్రం ఇదే

Published : May 03, 2026, 12:00 PM IST

Trading: ట్రేడింగ్‌లో గెలవాలంటే అద్భుతమైన స్ట్రాటజీ ఉంటే సరిపోతుందా? లేక అంతకంటే మరేదైనా ముఖ్యమైనది ఉందా? చాలామంది ట్రేడర్లు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటే చాలని అనుకుంటారు. కానీ, అసలు విజయం మీ మనస్తత్వం.. 

PREV
15
ట్రేడర్ ఏకాగ్రత - క్రమశిక్షణకు నిదర్శనం

స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ "డబ్బులు ఎలా సంపాదించాలి?" అని అడుగుతారు. కానీ, నిలదొక్కుకున్న ట్రేడర్లు మాత్రం "డబ్బులు ఎలా పోగొట్టుకోకూడదు?" అని ఆలోచిస్తారు. ట్రేడింగ్ అనేది కేవలం గ్రాఫ్‌లు చూడటం మాత్రమే కాదు, అది మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడమే.

25
అత్యుత్తమ స్ట్రాటజీ ఉన్నా..

ఒక ట్రేడర్ దగ్గర ప్రపంచంలోనే అత్యుత్తమ స్ట్రాటజీ ఉన్నా, అతని దగ్గర 'డిసిప్లిన్' లేకపోతే మార్కెట్ అతనిని క్షమించదు. చాలా మంది ట్రేడర్లు స్ట్రాటజీలను మారుస్తూ ఉంటారు. కానీ, ఒకే స్ట్రాటజీని నమ్ముకుని, దానిపై పట్టు సాధించి, రిస్క్ మేనేజ్‌మెంట్ పాటించేవారే చివరికి లాభాల్లో ఉంటారు.

35
నష్టం వచ్చినప్పుడు భయం..

ట్రేడింగ్‌లో 80 శాతం సైకాలజీ, కేవలం 20 శాతం మాత్రమే స్ట్రాటజీ పని చేస్తుంది. నష్టం వచ్చినప్పుడు భయం, లాభం వచ్చినప్పుడు అత్యాశ కలగడం సహజం. అయితే, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ, రూల్స్ ప్రకారం ట్రేడ్ చేయడమే అసలైన ట్రేడర్ లక్షణం.

45
మార్కెట్ మనల్ని ఓడించదు..

"మార్కెట్ మనల్ని ఓడించదు, మన తొందరపాటే మనల్ని ఓడిస్తుంది" అనేది చేదు నిజం. చేసిన తప్పునే మళ్ళీ చేయకపోవడమే ట్రేడింగ్‌లో ఎదుగుదల. క్రమశిక్షణ అంటే కేవలం రూల్స్ పాటించడం మాత్రమే కాదు, మన ప్రయాణాన్ని మనమే విశ్లేషించుకోవడం చాలా ముఖ్యం.

55
అంతిమ విజయం - స్థిరమైన రాబడులు

ట్రేడింగ్‌లో ఎవరూ కూడా ఓవర్ నైట్‌లో విజయం సాధించరు. నెలల తరబడి పాటించిన క్రమశిక్షణ ఫలితమే లాభాలు రావడం. స్థిరత్వం అనేది రోజువారీ లాభాల్లో కాదు, అది మీ ప్రవర్తనలో ఉండాలి.

Read more Photos on
click me!

Recommended Stories