ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్‌ఫోన్ ఉంది. ఉదయం నుండి రాత్రి వరకు అందరూ స్మార్ట్‌ఫోన్‌తోనే గడుపుతున్నారు. ఉద్యోగులకు స్మార్ట్‌ఫోన్ అత్యవసర వస్తువు అయిపోయింది. చాలా పనులకు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. కొంతమంది ఉద్యోగులు తరచూ వివిధ రకాల ఫోటోలు తీసి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక చాలా మీటింగ్ లు ఫోన్ లోనే వీడియో కాల్స్ చేస్తూ నిర్వహిస్తున్నారు. ఇలా ప్రతి పనికి స్మార్ట్ ఫోన్, దాని కెమెరా పనితీరు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అయితే చాలామంది స్మార్ట్‌ఫోన్ వచ్చిన తర్వాత దాన్ని సరిగా మెయింటెయిన్ చేయరు. ముఖ్యంగా కెమెరా విషయంలో అస్సలు పట్టించుకోరు. అందువల్లనే కెమెరాలో ఫోటోలు మసకగా వస్తుంటాయి.
ప్రస్తుతం మొబైల్ కంపెనీలు అధిక క్లారిటీ కెమెరాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. 200 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్న స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అయితే ఎన్ని మెగాపిక్సెల్ కెమెరా ఉన్నా చాలా సార్లు ఫోటోలు మసకబారుతుంటాయి. దీంతో వినియోగదారులు కొత్త స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేస్తుంటారు.
అయితే కెమెరా కారణంగా మీ మొబైల్‌ను మార్చాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ కెమెరాను మెరుగుపరచడానికి కొన్ని చిట్కాలను పాటించాలి. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తుంటే మీ ఫోన్ నుండి అద్భుతమైన ఫోటోలను క్లిక్ చేయవచ్చు. దీనికోసం ఈ చిట్కాలను పాటించాలి.
1. మైక్రోఫైబర్ క్లాత్ వాడండి
లెన్స్‌ను శుభ్రం చేయడానికి గ్లాసెస్ కోసం ఉపయోగించే మైక్రోఫైబర్ క్లాత్ ఉపయోగించండి. ఇది సున్నితమైన లెన్స్‌ను గీతలు పడకుండా శుభ్రం చేస్తుంది.
2. కెమెరా క్లీనింగ్ కిట్
మార్కెట్‌లో ప్రత్యేకంగా కెమెరా లెన్స్‌లు శుభ్రం చేయడానికి కిట్‌లు లభ్యమవుతాయి. వీటిని ఉపయోగించి లెన్స్‌ను మరింత ఎఫెక్టివ్ గా శుభ్రం చేయవచ్చు.
3. సానిటైజర్ లేదా స్పిరిట్ ఉపయోగించండి
ఒక శుభ్రమైన కాటన్ పై స్పిరిట్ లేదా సానిటైజర్ వేసి లెన్స్‌ను క్లీన్ చేయండి. ఇది ఆయిల్, ఫింగర్ ప్రింట్‌లను తొలగిస్తుంది. చాలా ఎక్కువ మోతాదులో రాయొద్దు.
4. బ్లోయర్ వాడడం
చిన్న బ్లోయర్ లేదా కెమెరా బ్లోయర్ ద్వారా లెన్స్ పైని దుమ్మును క్లీన్ చేయండి.
5. లెన్స్‌ను టచ్ చేయకూడదు
లెన్స్‌ను వేలితో ముట్టుకొనే అలవాటు ఉంటే మానుకోండి. చాలా మంది లెన్స్ శుభ్రం చేయడానికి వేలును ఉపయోగిస్తారు. కాని విషయం ఏమిటంటే వారి వేలి ముద్రలు లెన్స్ పై ఉండిపోతాయి. అవి ఫోటోలపై ఎఫెక్ట్ చూపుతాయి.
6. కవర్, ప్రొటెక్టర్ వాడండి
కెమెరా లెన్స్‌కి ప్రత్యేకంగా ఉండే ప్రొటెక్టర్ వాడండి. ఇది లెన్స్‌ను దుమ్ము నుంచి కాపాడుతుంది. పొరపాటున ఫోన్ కింద పడినా కెమెరాకు, లెన్స్ కు ఏమీ కాకుండా కాపాడుతుంది.
7. పొడి ప్రదేశంలో ఉంచడం
సెల్‌ఫోన్‌ను ఎక్కువ తేమ ఉన్న ప్రదేశాల్లో ఉంచొద్దు. తేమ వల్ల లెన్స్‌పై పొగ లాంటిది ఏర్పడి అలాగే ఉండిపోతుంది. ఇది తెలియకుండా ఫోటోలపై ప్రభావం చూపుతుంది.