Spam calls, smsలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా Block చేయండి

First Published | Nov 28, 2024, 7:32 PM IST

రోజూ మీకు స్పామ్ కాల్స్, SMSలు ఎక్కువగా వస్తున్నాయా? బ్లాక్ చేసినా కొత్త నెంబర్ల నుండి కాల్స్, మెసేజెస్ వస్తూనే ఉన్నాయా? ఈ సమస్యకు సులభమైన పరిష్కారం ఇక్కడ ఉంది. 

ప్రమోషన్లు, ప్రకటనలు, లోన్లు, క్రెడిట్ కార్డులకు సంబంధించిన రోజువారీ స్పామ్ కాల్స్ మీకు చిరాకు తెప్పిస్తున్నాయా? సైబర్ నేరస్థులు స్పామ్ కాల్స్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌ని ఉపయోగిస్తున్నారు. ఇలా తమ వినియోగదారులు స్పామ్ కాల్స్, మెసేజస్ వల్ల ఇబ్బందులు పడకూడదని, వారి డాటా సెక్యూర్ గా ఉండాలని రిలయన్స్ జియో ఇప్పుడు సులభమైన పరిష్కారాన్ని అందిస్తోంది. అదేంటో తెలుసుకుందాం రండి. 

జియో వినియోగదారులు మై జియో యాప్‌లో ఒకే క్లిక్‌తో అవాంఛిత కాల్స్, SMSలను బ్లాక్ చేయవచ్చు. ఇది రోజువారీ చికాకులు, సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. మనశ్శాంతి కోసం స్పామ్ కాల్స్, SMSలను బ్లాక్ చేయండి.


ఆన్ లైన్ లో ఏదైనా వస్తువు కొన్నప్పుడు, బ్యాంకు ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఓటీపీలు వస్తుంటాయి. మరి జియో యాప్ ద్వారా స్పామ్ కాల్స్, మెసేజెస్ బ్లాక్ చేయడం వల్ల OTPలు, విశ్వసనీయ బ్రాండ్‌ల నుండి వచ్చే ముఖ్యమైన సందేశాలు నిలిచిపోతాయని మీరు భావించొచ్చు. అయితే జియో యాప్ లో స్పామ్ కాల్స్, మెసేజెస్ బ్లాక్ చేయడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ తెలిపింది. మీరు అన్ని రకాల స్పామ్ కాల్‌లను బ్లాక్ చేయవచ్చు. లేదా కొన్ని ప్రమోషనల్ కాల్‌లను అనుమతించే విధంగా యాప్ లో అవకాశం ఉంటుంది.

డిస్టర్బ్ చేయవద్దు ఆప్షన్

స్పామ్ కాల్స్, SMSల ద్వారా టెలి మార్కెటింగ్ కంపెనీలు తరచూ ఫోన్ కాల్స్ చేసి డిస్టర్బ్ చేస్తుంటాయి కదా.. ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి మీరు టెలి మార్కెటింగ్ కంపెనీల కాల్స్ బ్లాక్ చేయవచ్చు. దీని కోసం మీరు జియోలో డిస్టర్బ్ చేయవద్దు (DND) ఆప్షన్ ని యాక్టివేట్ చేయండి.

మై జియో DND సర్వీస్

అదేవిధంగా బ్యాంకింగ్ కాల్స్ మిమ్మల్ని మీ వర్క్ టైమ్ లో ఇబ్బంది పెడుతుంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా తమ ఫ్లాట్లు, ప్లాట్లు అమ్ముకోవడానికి ఎప్పుడు పడితే అప్పుడు కాల్స్ చేస్తుంటారు. ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూట్స్, హాస్పిటల్స్, ట్రావెల్స్ ఇలా వివిధ కేటగిరీల నుండి కాల్స్, మెసేజెస్ వస్తూనే ఉంటాయి. ఇలాంటి వాటినన్నింటినీ బ్లాక్ చేయడానికి వినియోగదారులు DNDని ఆప్షన్ ను ఉపయోగించుకోవచ్చు. 

కొన్ని సార్లు కంపెనీ నంబర్లు బ్లాక్ లో పెట్టినా, వేరే నంబర్ల నుంచి కాల్స్, మెసేజస్ వస్తుంటాయి. అలాంటప్పడు కంప్లీట్ స్పామ్ బ్లాకింగ్ ఆప్షన్ ను ఉపయోగించండి. దీని వల్ల ఇక ఎలాంటి కంపెనీలు మీకు కాల్స్, మెసేజస్ చేయలేవు. నెట్‌వర్క్ ప్రొవైడర్లు, ప్రభుత్వ సంస్థల నుండి కూడా కాల్స్, SMSలు రావు. స్పామ్ కాల్స్ నుంచి మాక్సిమం రక్షణ లభిస్తుంది. ఈ అవకాశం జియో వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. 

Latest Videos

click me!