Business Secrets: ఒక చిన్న కిరాణా షాపు లేదా జనరల్ స్టోర్ ద్వారా నెలకు రూ. 50 వేలు ఎలా సంపాదించవచ్చో ఇప్పుడు చూసేద్దాం. వ్యాపారంలో లాభాలను పెంచుకోవడానికి అవసరమైన మూడు ముఖ్యమైన ట్రిక్స్ ఇక్కడ తెలుసుకోండి.
చాలామంది తక్కువ పెట్టుబడితో చిన్న షాపులు పెడుతుంటారు. కానీ అందరూ ఆశించిన స్థాయిలో లాభాలను గడించలేరు. అయితే, సరైన వ్యూహాలు పాటిస్తే ఒక చిన్న షాపు ద్వారా కూడా నెలకు రూ. 50 వేలపైగా సంపాదించవచ్చు. ఆ సక్సెస్ వెనుక ఉన్న రహస్యాలు ఇలా..
25
డిమాండ్ ఉన్న వస్తువుల నిల్వ
వ్యాపారంలో సక్సెస్ కావాలంటే కస్టమర్లు ఎక్కువగా ఏ వస్తువులు అడుగుతున్నారో గమనించాలి. నిత్యం అమ్ముడయ్యే చిన్న చిన్న వస్తువులను ఎప్పుడూ స్టాక్‌లో అందుబాటులో ఉంచాలి. దీనివల్ల కస్టమర్లు మీ షాపునకు క్రమం తప్పకుండా వస్తారు.
35
కస్టమర్లతో సత్సంబంధాలు
వ్యాపారం అంటే కేవలం వస్తువులు అమ్మడం మాత్రమే కాదు. నమ్మకాన్ని అమ్మడం. కస్టమర్లతో ఎల్లప్పుడూ చిరునవ్వుతో, స్నేహపూర్వకంగా మాట్లాడాలి. వారితో మంచి అనుబంధం ఏర్పడితే, వారు వేరే చోటికి వెళ్లకుండా మీ షాపునకే పదే పదే వస్తారు.
మీ షాపు పక్కనే ఖాళీ ఉంటే, ఒక చిన్న టీ స్టాల్ లేదా టిఫిన్ సెంటర్ లాంటి సైడ్ బిజినెస్ ప్రారంభించడం మంచిది. దీనివల్ల షాప్‌నకు వచ్చే కస్టమర్ల సంఖ్య పెరగడమే కాకుండా, అదనపు ఆదాయం కూడా లభిస్తుంది.
55
'మంచి ప్లాన్' ఉండాలి
వ్యాపారం ఏదైనా కేవలం షాపు ఉంటే సరిపోదు, దానిని నడిపించే ఒక 'మంచి ప్లాన్' ఉండాలి. కష్టపడే తత్వంతో పాటు స్మార్ట్ ఆలోచనలు తోడైతే చిన్న షాపు ద్వారా కూడా నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.