Business Plan: ఊరైనా, పట్టణమైనా హిట్టే..! నెలకు రూ. 2 లక్షలు.. ఇప్పుడిదే ఎవర్‌గ్రీన్ బిజినెస్

Published : Mar 22, 2026, 10:02 AM IST

Business Plan: కోడిగుడ్ల హోల్‌సేల్ బిజినెస్ ద్వారా నెలకు లక్షల్లో సంపాదించడం ఎలా.? తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే ఈ బిజినెస్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు 

PREV
15
ఎగ్స్ హోల్‌సేల్ బిజినెస్

నిత్యం డిమాండ్ ఉండే వ్యాపారాలలో కోడిగుడ్ల హోల్‌సేల్ బిజినెస్ ఒకటి. సామాన్యుడి నుంచి సంపన్నడి వరకు ప్రతిరోజూ ఆహారంలో గుడ్లను ఉపయోగిస్తారు కాబట్టి, ఈ వ్యాపారంలో నష్టపోయే అవకాశం చాలా తక్కువ.

25
పెట్టుబడి, ధరల వివరాలు

హోల్‌సేల్ ధర: ఒక ట్రే(30 గుడ్లు) మీకు హోల్‌సేల్ ధరలో సుమారు రూ. 120 నుంచి రూ. 150 వరకు లభిస్తుంది.

రిటైల్ ధర: అదే ట్రేని మీరు రిటైల్ మార్కెట్‌లో రూ. 150 నుంచి రూ. 180 వరకు విక్రయించవచ్చు.

ప్రతి ట్రేపై లాభం: ఒక్కో ట్రే విక్రయం మీద మీకు రూ. 30 నుంచి రూ. 40 వరకు నికర లాభం ఉంటుంది.

35
ఆదాయ అంచనా

ఒకవేళ మీరు మార్కెటింగ్ బాగా చేసి, రోజుకు సుమారు 300 ట్రేలు అమ్మగలిగితే:

రోజువారీ లాభం: రూ. 9 వేల నుంచి రూ. 12 వేల వరకు ఉంటుంది.

నెలవారీ ఆదాయం: అన్ని ఖర్చులు పోను నెలకు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది.

45
వ్యాపారాన్ని ఎక్కడెక్కడ చేయవచ్చు

ఈ వ్యాపారంలో రాణించాలంటే మీ నెట్‌వర్క్‌ను ఈ ప్రాంతాల్లో వృద్ది చేయాలి..

  1. హోటళ్లు, రెస్టారెంట్లు.
  2. బేకరీలు, స్వీట్ షాపులు.
  3. సూపర్ మార్కెట్లు, కిరాణా స్టోర్స్.
  4. స్కూల్, కాలేజీ హాస్టళ్లు.
  5. జిమ్స్, ఫిట్‌నెస్ సెంటర్లు.
55
తక్కువ రిస్క్, స్థిరమైన ఆదాయం

ఎగ్స్ హోల్‌సేల్ బిజినెస్ అనేది తక్కువ రిస్క్, స్థిరమైన ఆదాయం ఇచ్చే వ్యాపారం. సరైన మార్కెటింగ్, నాణ్యమైన సరఫరా ఉంటే, అతి తక్కువ కాలంలోనే ఈ వ్యాపారంలో మంచి స్థాయికి చేరుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories