పుట్ట గొడుగులు ఒక్కోసారి అమ్ముడుపోకుండా మిగిలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని ఇలా మార్చి తిరిగి అమ్మవచ్చు.
పుట్టగొడుగుల పచ్చడి కోసం వాటిని చిన్న ముక్కలుగా కోసి, నూనెలో వేయించి, మసాలాలు కలిపి తయారు చేస్తారు. ఇది చాలా నెలలు వరకు నిల్వ ఉంటుంది. సూపర్ మార్కెట్లలో పెట్టి వీటిని అమ్మవచ్చు.
పుట్టగొడుగుల పొడి కోసం వాటిని బాగా ఎండబెట్టి, పొడి చేయాలి. దీన్ని సూప్, కూర లేదా సత్తుపిండి తయారీలో వాడొచ్చు.
పుట్టగొడుగుల సూప్ మిక్స్ కోసం పుట్టగొడుగుల పొడితో మొక్కజొన్న పిండి, మిరియాల పొడి, ఉప్పు కలిపి ఇన్‌స్టంట్ సూప్ మిక్స్‌గా చేసి అమ్మవచ్చు.
పుట్టగొడుగుల అప్పడాలు/వడియాలు తయారుచేసేందుకు పుట్టగొడుగుల గుజ్జును అప్పడాలు లేదా వడియాలు చేసేటప్పుడు కలిపి చేయొచ్చు. ఆరోగ్యకరమైన స్నాక్‌గా దీనికి మంచి డిమాండ్ ఉంది.
సూపర్ మార్కెట్లు, ఆర్గానిక్ స్టోర్లు, డిపార్ట్‌మెంటల్ స్టోర్లలో మీ ఉత్పత్తులను అమ్మకానికి పెట్టొచ్చు. Amazon, Flipkart లాంటి సైట్లలో లేదా సొంతంగా సోషల్ మీడియా పేజీలు (Instagram/Facebook) మొదలుపెట్టి అమ్మొచ్చు. పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లకు 'సూప్ మిక్స్', 'పుట్టగొడుగుల పొడి'ని బల్క్‌గా సరఫరా చేయొచ్చు. ఇలా అమ్మినా కూడా మీకు మంచి లాభాలు వస్తాయి. సాధారణంగా కిలో పుట్టగొడుగులను రూ.200కి అమ్మితే, అదే కిలో పుట్టగొడుగులను పచ్చడిగా మారిస్తే, దాని వల్ల రూ.500 నుంచి రూ.700 వరకు ఆదాయం పొందొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ఎండిన పుట్టగొడుగుల పొడి ధర నాణ్యతను బట్టి కిలో రూ.1,500 నుంచి రూ.3,000 వరకు ఉంటుంది.