Sim card: ప్రీపెయిడ్‌, పోస్ట్ పెయిడ్ సిమ్‌.. రెండింటిలో ఏది బెట‌ర్‌? రెండింటి మ‌ధ్య తేడా ఏంటి..

Published : Jan 04, 2026, 11:00 AM IST

Sim card: కోట్లాది మంది సిమ్ కార్డుల‌ను ఉప‌యోగిస్తున్నారు. సిమ్ కార్డుల్లో ప్రీపెయిడ్‌, పోస్ట్ పెయిడ్ అని రెండు ర‌కాలు ఉంటాయని తెలిసిందే. అయితే చాలా మందికి ఇప్ప‌టికీ ఈ రెండింటి మ‌ధ్య తేడా ఏంటో తెలియ‌దు. మ‌రి ఆ వివ‌రాలు ఏంటో తెలుసుకుందామా.? 

PREV
15
ప్రీపెడ్ vs పోస్ట్‌పెయిడ్ గందరగోళం

భారతదేశంలో కోట్లాది మంది మొబైల్ వాడుకదారులు ఉన్నా, ఇప్పటికీ చాలామందికి ఏ ప్లాన్ తమకు సరిపోతుందో స్పష్టత ఉండదు. ఒకసారి తీసుకున్న ప్లాన్‌ను ఏళ్ల తరబడి మార్చకుండా వాడటం వల్ల అవసరాలకు సరిపోని సేవలకు కూడా డబ్బు చెల్లిస్తున్నారు. ఫలితంగా ఎక్కువ ఖర్చు లేదా తక్కువ సౌకర్యాలు ఎదురవుతున్నాయి.

25
ప్రీపెయిడ్‌ ప్లాన్ అంటే ఏంటి? ఎవరికీ ఉపయోగకరం?

ప్రీపెయిడ్ ప్లాన్‌లో ముందుగానే రీఛార్జ్ చేసుకుని కాల్స్, డేటా, SMS వాడాలి. బ్యాలెన్స్ లేదా వాలిడిటీ పూర్తయితే సేవలు ఆగిపోతాయి. ఈ ప్లాన్ ముఖ్యంగా ఖర్చుపై పూర్తిగా నియంత్రణ కోరేవారు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, తక్కువ వినియోగం ఉన్నవారి కోసం సరైన ఎంపిక. బిల్ షాక్ ఉండదు. అవసరానికి అనుగుణంగా ప్లాన్ మార్చుకునే స్వేచ్ఛ ఉంటుంది.

35
పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లాభాలేంటీ.?

పోస్ట్‌పెయిడ్‌లో ముందుగా వినియోగం ఉంటుంది. నెల చివర ఒక ఫిక్స్‌డ్ బిల్ వస్తుంది. ఇందులో డేటా, కాల్స్, కొన్ని సందర్భాల్లో OTT సబ్‌స్క్రిప్షన్లు కూడా కలుపుతారు. ఎక్కువ డేటా అవసరమైనవారు, ఆఫీస్ పనుల కోసం ఫోన్‌పై ఆధారపడేవారు, నిరంతర సేవలు కోరేవారికి ఈ ప్లాన్ అనుకూలం. ఫ్యామిలీ పోస్ట్‌పెడ్ ప్లాన్‌లో ఒకే బిల్లుపై పలువురు నంబర్లు కలిపే అవకాశం ఉంటుంది.

45
ఖర్చు పరంగా ఏది బెట‌ర్‌.?

ప్రీపెయిడ్‌లో ముందే డబ్బు చెల్లిస్తారు కాబట్టి అదనపు ఖర్చు ప్రమాదం తక్కువ. పోస్ట్‌పెయిడ్‌లో సౌకర్యాలు ఎక్కువగా ఉన్నా వినియోగంపై దృష్టి పెట్టకపోతే బిల్ ఎక్కువగా రావచ్చు. అయితే తాజా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో ఫిక్స్‌డ్ లిమిట్, డేటా క్యాప్ సదుపాయం అందుబాటులో ఉండటం వల్ల ఖర్చుపై నియంత్రణ సాధ్యమవుతోంది.

55
నెట్‌వర్క్, స్పీడ్ విషయాల్లో నిజం ఏంటి?

పోస్ట్‌పెయిడ్‌లో నెట్‌వర్క్ బాగా వస్తుందని చాలామంది భావిస్తారు. వాస్తవంగా చూస్తే చాలా ఆపరేటర్లు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రెండింటికీ ఒకే నెట్‌వర్క్ అందిస్తున్నారు. తేడా ప్రధానంగా కస్టమర్ సపోర్ట్, కొన్ని ప్రీమియం సౌకర్యాల వరకు పరిమితం.

మొత్తంగా చెప్పాలంటే.. తక్కువ ఖర్చు, ఎక్కువ నియంత్రణ కావాలంటే ప్రీపెడ్ సరైన ఎంపిక. భారీ డేటా వినియోగం, ఫ్యామిలీ ప్లాన్ అవసరం ఉంటే పోస్ట్‌పెయిడ్ వైపు చూడవచ్చు. మీ అవసరాలు స్పష్టంగా తెలుసుకుని ప్లాన్ ఎంచుకుంటే డబ్బు కూడా ఆదా అవుతుంది, సౌకర్యాలు కూడా పెరుగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories