Silver Price: ఈ రోజు 5 కిలోల వెండి కొంటే.. 2030 నాటికి మీ ద‌గ్గ‌ర ఎన్ని డ‌బ్బులుంటాయో తెలుసా.?

Published : Dec 14, 2025, 07:55 AM IST

Silver Price: ఎన్న‌డూ లేని విధంగా వెండి ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి. బంగారంతో పోటీగా దూసుకెళ్తున్నాయి. కాగా రానున్న రోజుల్లో వెండి ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో 2030 నాటికి వెండి ధ‌ర ఎంత కానుందో చూద్దాం. 

PREV
15
ఆల్ టైమ్ హైకి వెండి ధరలు

డిసెంబ‌ర్ 13వ తేదీన దేశవ్యాప్తంగా వెండి ధరలు భారీ స్థాయికి చేరాయి. ఢిల్లీలో ఒక కిలో వెండి ధర రూ.1,98,000గా నమోదైంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో ధర రూ.2 లక్షలు దాటింది. చెన్నైలో అయితే వెండి ధర కిలోకు రూ.2,16,100 వరకు చేరింది. స్థానిక పన్నులు, డిమాండ్ కారణంగా నగరాల మధ్య ఈ స్వల్ప తేడా కనిపిస్తోంది.

25
ఒక్క కిలో వెండి కొనాలంటే ఎంత ఖర్చు?

ఢిల్లీలో ఉన్న ధర ఆధారంగా లెక్క వేస్తే

1 కిలో వెండి ధర: రూ.1,98,000. ఇందుగా మేకింగ్ ఛార్జీలు కలపలేదు. పెట్టుబడి దృష్టితో కొనుగోలు చేస్తే ఇదే బేస్ రేట్‌గా తీసుకోవచ్చు.

35
5 కిలోల వెండి కొనుగోలు చేస్తే

వెండి ధ‌ర‌లు భారీగా పెరుగుతోన్న నేప‌థ్యంలో చాలా మంది బంగారంతో స‌మానంగా వెండిపై కూడా పెట్టుబ‌డి పెడుతున్నారు. ప్ర‌తీ నెల కొంత మొత్తంలో వెండిని కొని పెడుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ఈరోజు 5 కిలోల వెండి కొనుగోలు చేయాలంటే మీరు సుమారు రూ. 9.,90,000 ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపు రూ. 10 ల‌క్ష‌లు అనుకోండి.

45
2030 నాటికి ఈ వెండి విలువ ఎంత అవుతుంది?

మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం వచ్చే ఐదు సంవత్సరాల్లో వెండి ధర కిలోకు రూ.3 లక్షలు నుంచి రూ.3.50 లక్షల వరకు చేరే అవకాశం ఉంది. అలా జరిగితే మీరు ఈ రోజు కొనుగోలు చేసిన 5 కిలోల వెండి ధ‌ర 2030 నాటికి రూ. 15,00,000కు చేరుతుంద‌ని అంచ‌నా. అదే రూ. 3.5 ల‌క్ష‌ల‌కు చేరితే మొత్తం విలువ రూ.17.50 లక్షల వరకు పెరగవచ్చు. అంటే ఐదేళ్ల‌లో మీకు సుమారు రూ. 5 నుంచి రూ. 7 ల‌క్ష‌ల వ‌ర‌కు లాభం వ‌స్తుంది.

55
వెండి ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు ఎందుకు.?

ఇటీవల వెండి మార్కెట్‌లో భారీ ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఎంసీఎక్స్‌లో ఒక్క వారం లోనే కిలోకు రూ.9,400కు పైగా పెరుగుదల వచ్చింది. ఆల్ టైమ్ హై తర్వాత ఒక్క రోజులోనే రూ.8,800కుపైగా పడిపోయింది. డాలర్ బలహీనత, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, వడ్డీ రేట్ల మార్పులు కారణంగా వెండి ధరల్లో ఈ ఊగిసలాట కనిపిస్తోంది. నిపుణులు చెబుతోన్న దాని బ‌ట్టి వెండిని దీర్ఘకాల పెట్టుబడి దృష్టితో చూడాల‌ని సూచిస్తున్నారు. తక్షణ లాభాల కోసం కాకుండా ఓపికతో ఉండటం మంచిదని అంటున్నారు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. పెట్టుబ‌డి పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే ఉత్త‌మం.

Read more Photos on
click me!

Recommended Stories