Simple Earning: తక్కువ పెట్టుబడితో నెలకు యాభై వేల నుంచి లక్ష రూపాయలు సంపాదించవచ్చు. అరెకరం పొలం ఉంటే చాలు కొంచెం కష్టపడితే చాలు గ్రామంలోనే ఉండి బోలెడంత సంపాదించుకోవచ్చు. అధిక లాభాలు పొందడానికి ఏం చేయాలో బిజినెస్ ఐడియా తెలుసుకోండి.
గ్రామంలోనే ఉండి నెలకు యాభైవేల రూపాయలు సంపాదించే ఛాన్స్ ఉంది. దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువే అవసరం పడుతుంది. నెల రోజుల్లోనే మీకు మంచి ఆదాయం కోసం చూసేవారికి ఆకుకూరల సాగు అద్భుతమైన అవకాశం. ఆకుకూరలకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సరైన ప్రణాళికతో ఈ సాగు చేస్తే నెలకు రూ.50,000 వరకు సంపాదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
25
తోటకూర, పాలకూర
ఎంత తక్కువ స్థలం ఉన్నా చాలు తక్కువ సమయంలో ఆకుకూరల పంట చేతికి వస్తుంది. ప్రతి నెలా దీన్ని నుంచి మీకు ఆదాయం వస్తుంది. తోటకూర, పాలకూర వంటివి 20 నుంచి 30 రోజుల్లోనే కోతకు వస్తాయి. పావు ఎకరం ఉన్నా చాలు మీకు నెలకు యాభై వేల రూపాయలు ఆదాయం వస్తుంది. ఇక అరెకరం పొలం ఉంటే లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది.
35
పెట్టుబడి ఎంత పెట్టాలి?
పావు ఎకరం పొలం ఉన్నవాళ్లు ఇరవై వేల రూపాయల పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఆ తరువాత మంచి ఆదాయాన్ని అందిస్తుంది. నెలరోజుల్లోనే ఈ పంట కోతకొస్తుంది. వారానికి రెండుసార్లు కోయవచ్చు. నెలకు 600 నుంచి 800 కిలోల ఆకుకూరల దిగుబడి వస్తుంది. దీని ద్వారా మీకు యాభైవేల రూపాయలు సంపాదన వస్తుంది. అదే అరెకరం పొలం అయితే సంపాదన రెట్టింపు అవుతుంది.
ఆకుకూరలు కోతకొచ్చాక ఎక్కడ అమ్మితే మంచి లాభాలు వస్తాయని ఎంతో మంది ఆలోచిస్తూ ఉంటారు. లాభాలు పెంచడానికి ప్రత్యక్ష అమ్మకాలు చాలా ముఖ్యం. మార్కెట్లలో పెద్ద ఎత్తున ఒకేసారి అమ్మేస్తే మంచిది. అలాగే హోటళ్లతో మాట్లాడి వారికి ప్రతి రోజూ లేదా వారానికి ఒకసారి అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకోవాలి. ఇక వీధి వ్యాపారులకు కూడా నేరుగా అమ్మవచ్చు.
55
ఆర్గానిక్ పద్దతిలో ఎక్కువ ధర
సేంద్రియ ఎరువులు వాడి ఆర్గానిక్ పద్ధతిలో ఆకుకూరలు పెంచితే అవి రెట్టింపు ధరకు అమ్ముడవుతాయి. మంచి విత్తనాలు, సరైన నీటిపారుదల, పురుగుల నియంత్రణపై దృష్టి పెడితే నష్టాలు తగ్గుతాయి. ఇది ఎంతో లాభదాయకమైన వ్యాపారం. ఉద్యోగాలు తగ్గుతున్న ఈ రోజుల్లో, ఆకుకూరల సాగు రైతులు, యువత, మహిళలకు మంచి స్వయం ఉపాధి. చిన్న ప్రయత్నం, సరైన ప్రణాళిక, ప్రత్యక్ష మార్కెట్‌తో నెలకు రూ.50,000 నుంచి లక్ష రూపాయలు సంపాదించడం సులువు.