Silver Price: వెండి కొన్న‌వారికి చుక్క‌లు క‌నిపిస్తున్నాయి.. మ‌రీ దారుణంగా మారిన ప‌రిస్థితి

Published : Feb 05, 2026, 10:35 AM IST

Silver Price: పెరుగుట విరుగ‌ట‌కే అనే సామెత వెండి ధ‌ర‌ల‌కు స‌రిగ్గా సెట్ అయ్యేలా క‌నిపిస్తోంది. ఆకాశ‌మే హ‌ద్దుగా దూసుకుపోయిన వెండి ధ‌ర‌లు ఒక్క‌సారిగా కుప్పుకూలుతున్నాయి. కేవ‌లం నెల రోజుల వ్య‌వ‌ధిలోనే కిలో వెండిపై ఏకంగా రూ. ల‌క్ష త‌గ్గ‌డం విశేషం. 

PREV
15
ఒక్కసారిగా కుప్పకూలిన వెండి ధరలు

మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వెండి ధరలు ఒక్కరోజులోనే భారీగా పడిపోయాయి. ఎంసీఎక్స్ మార్కెట్‌లో వెండి ధరలు సుమారు 6 శాతం పతనమవ్వడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురి చేసింది. రికార్డు స్థాయిలో ఉన్న ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో మార్కెట్‌లో గుబులు వాతావరణం నెలకొంది.

25
రికార్డు స్థాయి నుంచి భారీ పతనం

జనవరి నెలలో వెండి ధర కిలోకు దాదాపు రూ. 4.20 లక్షల వరకు చేరింది. అయితే ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ ధర ఏకంగా రూ.1.94 లక్షల స్థాయికి పడిపోయింది. అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో వెండి ఫ్యూచర్స్ లోయర్ సర్క్యూట్‌ను తాకినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఇంతటి వేగంతో ధరలు పడిపోవడం గతంలో అరుదుగా మాత్రమే కనిపించింది.

35
పతనానికి కారణాలు ఏమిటి?

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కొత్త చైర్మన్ నియామకంపై వచ్చిన వార్తలతో డాలర్ ఇండెక్స్ బలపడింది. దీని ప్రభావం బంగారం, వెండి ధరలపై నేరుగా పడింది. గత నెలలో వెండి ధరలు 150 శాతం కంటే ఎక్కువగా పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. అదనంగా 2026 కేంద్ర బడ్జెట్‌లో దిగుమతి సుంకాలపై చర్చలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. అంతర్జాతీయ ఎక్స్ఛేంజీల్లో మార్జిన్ నిబంధనలు పెరగడం వల్ల ట్రేడర్లు విక్రయాల వైపు మొగ్గు చూపారు.

45
నిపుణుల మాటలో ఇది హెల్తీ కరెక్షన్

ఇంత పెద్ద పతనం జరిగినా ఆర్థిక నిపుణులు ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. దీన్ని మార్కెట్‌లో సహజంగా జరిగే హెల్తీ కరెక్షన్‌గా వారు అభివర్ణిస్తున్నారు. దీర్ఘకాలంలో వెండి ధరలకు మళ్లీ మద్ధతు లభించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. అయితే తక్షణంలో ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని హెచ్చరిస్తున్నారు.

55
బంగారం ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల

ఫిబ్రవరి 5 నాటికి బంగారం ధరలు కూడా కొంత దిగివచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,54,723గా నమోదు కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,46,550గా ఉంది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర సుమారు 4,942 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గతంలో రూ.1.80 లక్షల స్థాయికి చేరిన బంగారం ధరలు ప్రస్తుతం దాదాపు రూ.30 వేల వరకు తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఊరటగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories