Silicone Storage Container: ఇంట్లో ఇది ఉంటే.. స‌గం కోసిన పండ్లు, కూర‌గాయ‌లు అస్స‌లు ఎండిపోవు

Published : Nov 14, 2026, 02:28 PM IST

Silicone Storage Container: కూరగాయలు, పండ్లు ఉపయోగించిన తర్వాత మిగిలిన సగం భాగాలను చాలామంది ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. అయితే సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే అవి త్వరగా ఎండిపోతాయి. ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టేందుకు అమెజాన్‌లో ఓ ప్రొడ‌క్ట్ అందుబాటులో ఉంది.

PREV
15
ఆకర్షణీయమైన డిజైన్.. నాణ్యమైన మెటీరియల్

స‌గం కోసిన ఆహార ప‌దార్థాలు త్వ‌ర‌గా పాడుకాకుండా ఉండ‌డానికి సిలికాన్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ స్టోరేజ్ కంటైన‌ర్ సెట్ అందుబాటులో ఉంది. పండ్లు, కూరగాయలను విడివిడిగా నిల్వ చేసుకునేందుకు ఉపయోగపడే ఈ సెట్‌లో నాలుగు కంటైనర్లు ఉంటాయి. ఈ స్టోరేజ్ కంటైనర్లను బయటివైపు ABS ప్లాస్టిక్‌తో, మూత భాగాన్ని ఫుడ్ గ్రేడ్ సిలికాన్‌తో తయారు చేశారు. సిలికాన్ మూత మెత్తగా, సాగే గుణంతో ఉండటం వల్ల కంటైనర్‌కు గట్టిగా సరిపోతుంది. దీనివల్ల లోపల నిల్వ చేసిన ఆహార పదార్థాలు బయట గాలికి ఎక్కువగా గురికాకుండా ఉంటాయి. వీటి అంచుల వద్ద ప్రత్యేకమైన పట్టుకునే భాగాలు ఉండటంతో మూతలను సులభంగా తెరవవచ్చు. చూడటానికి కూడా ఇవి ఆకర్షణీయంగా ఉంటాయి.

25
పండ్లు, కూరగాయలను తాజాగా ఉంచేందుకు..

ఈ సెట్‌లో నాలుగు వేర్వేరు కంటైనర్లు ఉంటాయి. వీటిలో సగం మిగిలిన అవకాడో, ఉల్లిపాయ, నిమ్మకాయ, టమాటా వంటి వాటిని నిల్వ చేసుకోవచ్చు. అంతేకాకుండా ద్రాక్ష, స్ట్రాబెర్రీలు, నారింజ పండ్లు, చీజ్ వంటి ఆహార పదార్థాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. సరైన విధంగా మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే ఆహార పదార్థాలు త్వరగా ఎండిపోకుండా, వాసన, రుచి మారకుండా ఉండేందుకు సహాయపడతాయి. అయితే నిల్వ చేసే పదార్థాన్ని బట్టి తాజాదనం ఉండే సమయం మారుతుంది.

35
ఫ్రిజ్‌లో వస్తువులను క్రమంగా సర్దుకోవచ్చు

సాధారణంగా ఫ్రిజ్‌లో సగం మిగిలిన కూరగాయలు, పండ్లను కవర్లలో లేదా ప్లేట్లలో ఉంచుతుంటారు. దీంతో స్థలం ఎక్కువగా ఆక్రమించడంతో పాటు ఏ వస్తువు ఎక్కడ ఉందో గుర్తించడం కష్టమవుతుంది. ఈ సమస్యను తగ్గించేందుకు ఈ కంటైనర్లు ఉపయోగపడతాయి. వీటికి వేర్వేరు రంగులు ఉండటంతో ఏ కంటైనర్‌లో ఏ ఆహార పదార్థం ఉందో సులభంగా గుర్తించవచ్చు. ఫ్రిజ్‌లో వస్తువులను ఒక క్రమంలో అమర్చుకోవడానికి కూడా వీలవుతుంది.

45
ఉపయోగించడం, శుభ్రం చేయడం సులభం

ఈ కంటైనర్లను ఉపయోగించడం చాలా సులభం. అవసరమైన పండు లేదా కూరగాయను లోపల ఉంచి సిలికాన్ మూతను బిగిస్తే సరిపోతుంది. అవసరమైనప్పుడు మూతను తీసి ఆహార పదార్థాన్ని బయటకు తీసుకోవచ్చు. ఉపయోగించిన తర్వాత నీటితో కడిగితే శుభ్రపడతాయి. డిష్‌వాషర్‌లో కూడా శుభ్రం చేసుకునే సౌకర్యం ఉంది. ఇంటి వంటగదితో పాటు ఆఫీసులు, రెస్టారెంట్లు, క్యాంపింగ్ వంటి సందర్భాల్లోనూ వీటిని ఉపయోగించుకోవచ్చు.

55
అమెజాన్‌లో 59 శాతం తగ్గింపుతో అందుబాటులో..

ఈ DZOPE 4 పీస్ సిలికాన్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ స్టోరేజ్ సెట్ అసలు ధర రూ.999. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో 59 శాతం డిస్కౌంట్‌తో రూ.406కే అందుబాటులో ఉంది. అంటే కొనుగోలుపై రూ.593 ఆదా చేసుకోవచ్చు. ఫ్రిజ్‌లో మిగిలిపోయిన పండ్లు, కూరగాయలను క్రమంగా నిల్వ చేసుకోవాలనుకునే వారికి ఈ నాలుగు కంటైనర్ల సెట్ ఉపయోగకరంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories