ఇన్సూరెన్స్ POSP (పాయింట్ ఆఫ్ సేల్ పర్సన్) కావడం అనేది ఎటువంటి పెట్టుబడి, టైమింగ్ లేకుండానే ఇంటినుండి ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించే ఉత్తమ మార్గాలలో ఒకటి. PSOP అంటే ఒక నిర్దిష్ట భీమా సంస్థకు సంబంధించిన సేవలను ఆన్‌లైన్‌లో విక్రయించే భీమా ఏజెంట్ అన్నమాట.
ఇలా భీమా ఏజెంట్ కావాలంటే మీ వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. మీరు కనీసం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అలాగే, జనరల్ / లైఫ్ ఇన్సూరెన్స్ లైసెన్స్ పొందడానికి IRDAI అందించే 15 గంటల తప్పనిసరి శిక్షణను మీరు పూర్తి చేయాలి. ఈ ఉద్యోగంలో, మీరు ఎంత ఎక్కువ పాలసీలను విక్రయిస్తే, మీరు అంత ఎక్కువ ఆదాయం పొందవచ్చు.