కరోనా కారణంగా భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను తగ్గించిన ఎడిబి.. చైనా వృద్ధి రేటుపై మాత్రం..

First Published Jul 20, 2021, 2:22 PM IST

కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి అంచనాను 10 శాతానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) తగ్గించింది. ఇంతకుముందు ఏప్రిల్‌లో వృద్ధి రేటు 11 శాతంగా ఉంటుందని ఎడిపి అంచనా వేసింది. 
 

2022-23 ఆర్థిక సంవత్సరానికి మెరుగైన వృద్ధి సూచనమల్టీ లాటరల్ ఫండింగ్ ఏజెన్సీ ఆసియా గ్రోత్ ఔట్ లుక్ (ఏ‌డి‌ఓ)లో మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారతదేశ జిడిపి వృద్ధి రేటు 1.6 శాతంగా ఉందని, దీనివల్ల జిడిపి వృద్ధి మొత్తం ఆర్థిక సంవత్సరంలో 1.6 శాతంగా ఉందని తెలిపింది. అంతేకాకుండా 2022-23 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను 7 శాతం నుండి 7.5 శాతానికి పెంచారు.
undefined
2021లో చైనా వృద్ధి రేటు 8.1 శాతంగా ఉండవచ్చులాక్ డౌన్ సడలించిన తరువాత ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనట్లు ప్రారంభ సూచికలు చూపిస్తున్నాయని ఏ‌డి‌పి తెలిపింది. ఏ‌డి‌ఓ 2021లో ఆర్ధిక సంవత్సరం 2021 (మార్చి 2022తో ముగిసిన) వృద్ధి సూచన 11 శాతం నుండి 10 శాతానికి తగ్గించింది. చైనా వృద్ధి రేటు 2021లో 8.1 శాతం, 2022లో 5.5 శాతం ఉండవచ్చని ఎడిబి తెలిపింది.
undefined
2022 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 10.5 శాతంగా ఉండవచ్చు: ఆర్‌బిఐ2022 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బిఐ అంచనా ప్రకారం జిడిపి వృద్ధి రేటు 10.5 శాతంగా ఉందని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. "వృద్ధి అంచనాను క్రిందికి సవరించడానికి నాకు ఎటువంటి కారణలు కనిపించడం లేదు" అని ఆయన అన్నారు. గత ఆర్థిక సంవత్సరం తీవ్రమైన క్షీణతతో ప్రారంభమైనప్పటికీ, ఆర్థిక వ్యవస్థ నాల్గవ త్రైమాసికంలో వృద్ధి మార్గానికి తిరిగి చేరుకొని జనవరి-మార్చి 2021 త్రైమాసికంలో 1.6 శాతం వృద్ధిని సాధించింది.
undefined
ఇండియన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ కార్యక్రమంలో సోమవారం చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సిఇఎ) కె.వి సుబ్రమణ్యం మాట్లాడుతూ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఉన్నప్పటికీ, 2021-22లో వృద్ధి రేటు ఎకనామిక్ సర్వే అంచనా ప్రకారం 11 శాతం ఉంటుందని, ఈ ఏడాది అధిక వృద్ధి రేటును సాధిస్తామని సంఘ్ కార్యక్రమంలో తెలిపారు. 2022-23లో ఆర్థిక వృద్ధి రేటు 6.5 నుంచి 7 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. కార్మిక, వ్యవసాయ చట్టాలు వంటి వివిధ నిర్మాణాత్మక సంస్కరణలు దీనికి సహకారం ఇస్తాయి అని అన్నారు.కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం పరిశ్రమ సంస్థ సిఐఐ కార్యక్రమంలో "చెడు కాలం గడిచిందని నేను ఆశిస్తున్నాను. ఎకనామిక్ ఫ్రంట్‌లో రికవరీ వైపు మేము బలంగా పయనిస్తున్నాము" అని అన్నారు.
undefined
click me!