గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలోకి రిలయన్స్.. రూ.75వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచన..

First Published Jul 19, 2021, 3:41 PM IST

ఆసియా అత్యంత ధనవంతుడు, బిలియనీర్ ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలోకి అడుగు పెట్టనుంది. ఇందుకోసం సుమారు  75వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. 

ఈ కొత్త గ్రీన్ ఎనర్జీ వ్యాపారం మొత్తం విలువ 36 బిలియన్ డాలర్లు అంటే సుమారు 2.6 లక్షల కోట్లు. ఆయిల్ టు పెట్రోకెమికల్స్ (ఓ2సి) ఇంధన ప్లాంట్లు, ఇంధన రిటైలింగ్ అండ్ డిజిటల్ సేవల వరకు వ్యాపారాలు కలిగి ఉన్న రిలయన్స్ ఇప్పుడు కొత్తగా గ్రీన్ ఎనర్జీ వ్యాపారాన్ని ప్రారంభించనుంది.అమెరికా బ్రోకరేజ్ బెర్న్‌స్టెయిన్ రీసెర్చ్ ఒక నివేదికలో రిలయన్స్ సోలార్ ఫోటోవాలిటిక్ సెల్స్, గ్రీన్ హైడ్రోజన్, పవర్ స్టోరేజ్ బ్యాటరీలు, ఫ్యుయెల్ సెల్స్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపింది.
undefined
ముకేష్ అంబానీ ప్రకటనగత నెలలో జరిగిన సంస్థ ఆన్యువల్ జెనరల్ మీటింగ్ లో పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ గ్రీన్ ఎనర్జీ రంగంలోకి ప్రవేశించబోతున్నట్లు ప్రకటించారు. ఫోటోవాలిటిక్ సెల్స్, గ్రీన్ హైడ్రోజన్, పవర్ స్టోరేజ్ బ్యాటరీలు, ఫ్యుయెల్ సెల్స్ తయారీకి కోసం వచ్చే మూడేళ్లలో నాలుగు ఉత్పాదక కర్మాగారాలను ఏర్పాటు చేయడానికి 75,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆయన ప్రకటించారు.
undefined
గ్రీన్ ఎనర్జీ వ్యాపారంతో పెరగనున్న రిలయన్స్ విలువసౌదీ అరాంకో ఛైర్మన్‌ను రిలయన్స్ డైరెక్టర్ల బోర్డులో చేర్చుకోవడం, కొత్త జియో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ రిలయన్స్ విలువ మరింత పెంచనుంది. గ్రీన్ ఎనర్జి కోసం క్యాపిటల్ ఎక్స్పెండీచర్ ఆధారంగా రిలయన్స్ క్లీన్ ఎనర్జి వ్యాపారం విలువ 36 బిలియన్ డాలర్లు.
undefined
ఇంకా ఆయిల్-టు-కెమికల్స్ వ్యాపారం విలువ 69 బిలియన్ డాలర్లు, డిజిటల్ సర్వీసెస్ వ్యాపారం విలువ 66 బిలియన్ డాలర్లు, రిటైల్ వ్యాపారం విలువ 81.2 బిలియన్ డాలర్లు. చమురు అండ్ గ్యాస్ వ్యాపారం విలువ 4.1 బిలియన్ డాలర్లు, మీడియా అండ్ ఇతర రంగాల వ్యాపార విలువ 3.7 బిలియన్ డాలర్లు. రిలయన్స్ మొత్తం వ్యాపారం విలువ 261 బిలియన్ డాలర్లు.
undefined
click me!