Phone Bill: జియో, ఎయిర్ టెల్ యూజర్లకు షాక్, మీ ఫోన్ బిల్లు ఇక పెరిగిపోతుంది

Published : Nov 06, 2025, 06:27 PM IST

Phone Bill: జియో, ఎయిర్ టెల్ యూజర్లకు షాక్ ఇచ్చే వార్త ఇది. భారతదేశ టెలికాం రంగం మరోసారి టారిఫ్ సవరణలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇలా అయితే మొబైల్ డేటా ప్లాన్ ధరలు 10 శాతం పెరిగే అవకాశం ఉంది. 

PREV
13
టారిఫ్ లు పెంచే ఛాన్స్

భారతదేశంలో టెలికాం రంగం అతి పెద్ద వ్యవస్థ. ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లను విపరీతంగా వాడుతున్నారు. ఇప్పుడు భారతదేశ టెలికాం రంగం మరో రౌండ్ టారిఫ్ సవరణలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా... సమీప భవిష్యత్తులో మొబైల్ డేటా ప్లాన్ ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. దాదాపు పది శాతం డేటా ప్లాన్ ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల మనం వాడే ఫోన్ల బిల్లు ప్రతినెలా 10 శాతం పెరుగుతుంది.

23
తక్కువ ప్లాన్లు మాయం

గత కొన్ని నెలలగా జియో, ఎయిర్ టెల్ నిశ్శబ్దంగా వినియోగదారులపై భారాన్ని మోపుతూ వచ్చాయి. రోజుకి 1gb ఇచ్చే ప్రీపెయిడ్ ప్లాన్లను నిశ్శబ్దంగా తొలగించాయి. దీంతో వినియోగదారులు ఎక్కువ ధర పెట్టి డేటా ప్లాన్లను కొనాల్సి వస్తోంది. ప్రీపెయిడ్ డేటా వినియోగదారులు రోజుకు 1.5 జిబి తో మొదలయ్యే ప్లాన్లను కొనుగోలు చేస్తున్నారు. ఇవి 299 రూపాయల నుండి కనిష్టంగా ప్రారంభమవుతున్నాయి. అంతకు ముందు వీటి ధర 249 రూపాయలు మాత్రమే ఉండేది.

33
తెలివిగా పెంచేశారు

మొబైల్ కంపెనీల వారు వినియోగదారులు ఎక్కువ డేటా వాడేలా, ఆ డేటాకు కూడా సంతోషంగా డబ్బు చెల్లించేలా ప్రేరేపిస్తున్నారు. దీనివల్ల వినియోగదారులపై వారికి తెలియకుండానే అధిక భారం పడుతుంది. అలాగే కొన్ని కంపెనీలు తమ వినియోగదారులను నెలవారీ లేదా మూడు నెలలకు ఒకసారి రీఛార్జ్ చేసే ప్లాన్లు తీసుకోమని ప్రోత్సహిస్తోంది. దీనివల్ల ఎన్నో లాభాలు ఉంటాయని కూడా ఆశ చూపిస్తోంది. దీంతో ఎంతోమంది ఇలాంటి రీఛార్జిలనే చేసుకుంటున్నారు. ఇది కూడా మొబైల్ కంపెనీల వారికి కలిసి వచ్చేదే. అయితే భవిష్యత్తులో టారిఫ్ లను 10 శాతం పెంచే విషయంపై ఇంకా మొబైల్ కంపెనీలు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ దాదాపు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై జియో ఎయిర్టెల్ వంటి వాటినుంచి ఇంకా నిర్ధారణ రావాల్సి ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories