టాటా నుంచి బైక్స్ వ‌చ్చేస్తున్నాయా.? రూ. 55 వేల‌కే 120 సీసీ అంటూ..

Published : Nov 06, 2025, 06:06 PM IST

Fact Check: సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత స‌మాచారం క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతోంది. అయితే ఈ వార్త‌ల‌న్నీ నిజ‌మేనా అంటే.? క‌చ్చితంగా అవున‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి. తాజాగా ఇలాంటి ఓ వార్తే నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. 

PREV
15
టాటా నుంచి బైక్స్

ఇటీవ‌ల సోషల్ మీడియాలో ఒక వార్త పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. “టాటా మోటార్స్ నుంచి కొత్త 125cc బైక్ వ‌స్తోంది అనేది స‌దరు వార్త సారాంశం. ఇక ఈ బైక్ ధ‌ర కేవ‌లం రూ. 55,999గా ఉండ‌నుంద‌ని, మైలేజ్ ఏకంగా లీట‌ర్ పెట్రోల్‌కి 100 కిలోమీట‌ర్లు ఇస్తుంద‌ని ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్ వేదిక‌గా పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు.

25
ఫీచ‌ర్లు సైతం

ఈ బైక్‌కి సంబంధించిన కొన్ని వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటి ప్ర‌కారం ఈ బైక్‌లో..

* ఇంజిన్‌: 124.8cc, సింగిల్ సిలిండర్

* మైలేజ్‌: 100 కిలోమీటర్లు లీటర్‌కి

* టెక్నాలజీ: డిజిటల్ బ్లూటూత్ డిస్‌ప్లే

* సేఫ్టీ: కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS)

* ప్రారంభ ధర‌: రూ. 55,999 (ఎక్స్‌షోరూమ్)

* లాంచ్: 2026లో వస్తుందంటూ ప్రచారం

ఇవి చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. టాటా బైక్ కూడా వ‌స్తోందా అని అనుకుంటున్నారు. అయితే ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉంద‌నేది ప్ర‌శ్న‌గా మారింది.

35
టాటా మోటార్స్ స్పందించిందా?

ఇప్పటివరకు టాటా మోటార్స్ ఈ బైక్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సాధారణంగా కంపెనీ కొత్త వాహనం తీసుకొస్తే.. ప్రెస్ మీట్‌ లేదా అధికారిక పోస్టర్‌ రిలీజ్ చేస్తుంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. అందువల్ల ఇది నిజమైన వార్త కాదని చెప్పవచ్చు.

45
గ‌తంలో కూడా ఇలాంటి పుకార్లు..

ఇలాంటి ప్రచారం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా “టాటా నానో ఎలక్ట్రిక్ కార్” వస్తోందంటూ చాలా వార్తలు వచ్చాయి. కొన్ని మీడియా సంస్థ‌లు కూడా ఈ వార్త‌ల‌ను ప్ర‌చురించాయి. దీంతో ఈ వార్త‌ల‌పై టాటా అధికారికంగా స్పందించింది. ఈ వార్త‌ల్లో ఏమాత్రం నిజం లేద‌ని టాటా తేల్చి చెప్పింది.

55
అసలు విషయం ఏంటంటే.?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న టాటా 125cc బైక్ రూ.55,999లో వస్తోంది, 100 km మైలేజ్ ఇస్తుంది. అయితే ఈ స‌మాచారం పూర్తిగా త‌ప్పుడు అని తేలింది. టాటా సంస్థ ఇప్పటివరకు ఈ బైక్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అందువల్ల ఈ వార్తను నమ్మాల్సిన అవసరం లేదు. అధికారిక సమాచారం వచ్చాకే నమ్మడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories