స్టాక్ మార్కెట్ టుడే: లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ

First Published Oct 25, 2021, 11:30 AM IST

స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. నేడు వారంలోని  మొదటి ట్రేడింగ్ రోజున సోమవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ సూచి సెన్సెక్స్ (BSE  sensex) 577 పాయింట్లు పెరిగి 61,398 వద్ద ప్రారంభమైంది.మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ (NSE nifty) కూడా ఈరోజు 8 పాయింట్ల లాభంతో 18,123.45 స్థాయిలో ప్రారంభమైంది. 

 అయితే కొంతకాలం తర్వాత సెన్సెక్స్ (sensex)100 పాయింట్ల పతనాన్ని చూసింది. నేడు BSEలో మొత్తం 1,665 కంపెనీలలో ట్రేడింగ్ ప్రారంభమైంది, వీటిలో దాదాపు 1,080 షేర్లు పెరుగుదలతో, 458 పతనంతో ప్రారంభమయ్యాయి. 127 కంపెనీల షేర్ ధర పెరగకుండా లేదా తగ్గకుండా ఓపెన్ అయ్యింది. అంతేకాకుండా ఈ రోజు 76 షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి వద్ద, 7 స్టాక్‌లు 52 వారాల కనిష్ట స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. ఉదయం నుండి 102 షేర్లు అప్పర్ సర్క్యూట్ కలిగి ఉండగా, 64 షేర్లు లోయర్ సర్క్యూట్ కలిగి ఉన్నాయి.
 

ఈ కంపెనీలు లాభపడ్డాయి
ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు 8 శాతం పెరిగాయి. యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, ఎన్‌టీపీసీ, హిందాల్కో, ఓఎన్‌జీసీ కూడా లాభపడ్డాయి. డేటా ప్రకారం, ICICI బ్యాంక్ షేర్లు సుమారు రూ.46 లాభంతో రూ.805.25 వద్ద ప్రారంభమయ్యాయి. ఓఎన్‌జీసీ షేరు దాదాపు రూ.2 లాభంతో రూ.159.35 వద్ద ప్రారంభమైంది. యాక్సిస్ బ్యాంక్ షేరు రూ.12 లాభంతో రూ.828.30 వద్ద ప్రారంభమైంది.
 

ఈ కంపెనీలకు నష్టాలు
ఏసియా పెయింట్స్ సెన్సెక్స్ ప్యాక్‌లో దాదాపు 3 శాతం పతనంతో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత వరుసగా ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ బ్యాంక్ మరియు బజాజ్ ఆటో ఉన్నాయి. డేటా పరిశీలిస్తే ఏషియన్ పెయింట్స్ స్టాక్ రూ.106 తగ్గి రూ.2,876.70 వద్ద ప్రారంభమైంది. అంతేకాకుండా టాటా కన్స్యూమర్ షేర్ సుమారు రూ.15 తగ్గి రూ.780.30 వద్ద ప్రారంభమైంది. కోటక్ మహీంద్రా వాటా దాదాపు రూ .36 తగ్గి రూ .2,135.80 వద్ద ప్రారంభమైంది. టాటా మోటార్స్ షేర్లు దాదాపు రూ .10 తగ్గి రూ. 480.85 వద్ద ప్రారంభమయ్యాయి.
 

నిన్న 30-షేర్ల సుచి 101.88 పాయింట్లు లేదా 0.17 శాతం పడిపోయి 60,821.62 కి, NSE నిఫ్టీ 63.20 పాయింట్లు లేదా 0.35 శాతం తగ్గి 18,114.90 వద్ద ముగిసింది. తాత్కాలిక స్టాక్ మార్కెట్ గణాంకాల ప్రకారం శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) గ్రాస్ ప్రాతిపదికన రూ.2,697.70 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అంతర్జాతీయ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 0.79 శాతం పెరిగి 85.31 డాలర్లకు చేరుకుంది.
 

click me!