ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్: ఐ‌టి‌ఆర్-1 ఫార్మ్ ఉపయోగించే జీతం పొందే వారు ఈ 9 డాక్యుమెంట్స్ తప్పనిసరి..

First Published Oct 22, 2021, 7:11 PM IST

న్యూఢిల్లీ: అసెస్మెంట్ ఇయర్(assesment year) 2021-22 లేదా 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫారమ్‌లను ఇప్పుడు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి యాక్సెస్ చేయవచ్చు.

అత్యంత సాధారణమైంది - ఐ‌టి‌ఆర్-1 లేదా సహజ్ (Sahaj) ఫారం - జీతం పొందే  పన్ను చెల్లింపుదారులు నింపాలి. ఈసారి ఫారమ్ కోసం మినహాయించని అలవెన్సులు, వేతనానికి అదనంగా పొందే చెల్లింపులు, ఇతరత్రా అవసరాల వంటి ప్రత్యేక రంగాలలో అసెస్సీ వివరాలను కోరుతుంది.

ఐ‌టి‌ఆర్-1 (ITR-1)లేదా సహజ్ ఫారం(sahaj form)ని దాఖలు చేయడానికి మీరు తప్పనిసరిగా ఈ 9 డాక్యుమెంట్స్ లేదా సమాచారాన్ని తప్పక ఉంచుకోవాలి

1. సాధారణ సమాచారం

పాన్

ఆధార్ కార్డ్ నంబర్

2. జీతం/పెన్షన్: ఉద్యోగి (ల) నుండి ఫారం 16

3. హౌస్ ప్రాపర్టీ నుండి ఆదాయం

అద్దె రిసిప్ట్ 

వడ్డీ కోత గురించి హౌసింగ్ లోన్ అకౌంట్ స్టేట్‌మెంట్

4. ఇతర సోర్సెస్ 

సేవింగ్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ  గురించి బ్యాంక్ స్టేట్‌మెంట్/పాస్‌బుక్ 

5. చాప్టర్ VI-A కింద డిడక్షన్ క్లెయిమ్ 

PF/NPSకి మీ కాంట్రీబుషన్ 

మీ పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజు

లైఫ్ ఇన్షూరెన్స్ ప్రీమియం రిసిప్ట్ 

స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు

మీ హోమ్ లోన్ పై ప్రిన్సిపాల్ రిపేమెంట్  

ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్/మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు

80Gకి అర్హమైన విరాళాల వివరాలతో  రిసిప్ట్ 

అగ్రిగేట్ మొత్తం తగ్గింపు  u/s 80C, 80CCC, 80CCD (1), గరిష్ట పరిమితి రూ .1.5 లక్షల వరకు పరిమితం చేయబడుతుంది.
 

6. చాప్టర్ VIA పార్ట్ B కింద ఏదైనా తగ్గింపు క్లెయిమ్ చేయడం కోసం మీరు ఏప్రిల్ 1, 2020 నుండి జూలై 31, 3030 మధ్య ఏదైనా పెట్టుబడి/డిపాజిట్/చెల్లింపులు చేసినట్లయితే షెడ్యూల్ Dlని నింపండి.
 

7. ట్యాక్స్ పేమెంట్ వివరాలు

మీ ఫారం 26ASలో ఉన్న టాక్స్ చెల్లింపు వివరాలను వేరిఫై చేయండి

8. టి‌డి‌ఎస్ వివరాలు

మీ ఫారమ్ 16 (జీతం), 16A (నాన్-సాలరి), 16C (రెంట్) లో క్రెడిట్ మొత్తాన్ని,  టి‌ఏ‌ఎన్ వివరాలు  వేరిఫై చేయండి

టెనెంట్  పాన్/ఆధార్

9. ఇతర సమాచారం

వ్యవసాయ ఆదాయం, డివిడెండ్ వంటి మినహాయింపు  ఆదాయం (రిపోర్టింగ్ ప్రయోజనం కోసం మాత్రమే)

భారతదేశంలో ఉన్న అన్ని యాక్టివ్ బ్యాంక్ ఖాతాల వివరాలు (రీఫండ్ క్రెడిట్ కోసం కనీసం ఒక ఖాతాను ఎంచుకోవాలి)

రిలీఫ్ u/s 89 క్లెయిమ్ చేయబడితే ఫారం 10E

పన్ను చెల్లింపుదారులు (tax payers)2020-21 ఆర్థిక సంవత్సరానికి (AY 2021-22) ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేస్తారు. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించే క్రమంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేయడానికి గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) మళ్లీ పొడిగించినట్లు గమనించవచ్చు. ఐ‌టి‌ఆర్ ని దాఖలు చేయడానికి కొత్త గడువు సెప్టెంబర్ 30 నుండి 31 డిసెంబర్ 2021కి మార్చబడింది.  

click me!