వాహనదారులకు చెమటలు పట్టిస్తున్న ఇంధన ధరలు.. రోజురోజుకి ట్విస్ట్ ఇస్తూ కొనసాగుతున్న పెంపు..

First Published Oct 23, 2021, 10:42 AM IST

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న చమురు ధరలు(oil prices) సామాన్యులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన ధరల నోటిఫికేషన్ ప్రకారం పెట్రోల్(petrol), డీజిల్ (diesel)ధరలు వరుసగా నాలుగో రోజు అక్టోబర్ 23న కూడా పెరిగాయి, దీంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఆల్-టైమ్ గరిష్టా స్థాయికి చేరుకుంది.

నేడు పెట్రోల్ పై లీటరుకు 35 పైసలు పెరగటంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 107 మార్క్ దాటి రూ.107.24 వద్ద ఆల్ టైమ్ హైకి చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటరుకు 35 పైసలు పెరిగగా రూ.95.97కి చేరుకుంది.

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.12కు పెరగగా, డీజిల్ ధర రూ.104కు పెరిగింది. మే 29న లీటరు పెట్రోల్‌ను రూ. 100 కంటే అధిక ధరకు విక్రయించిన దేశంలోనే మొదటి నగరంగా ముంబై  అవతరించింది.
 

ఇక కోల్‌కతాలో కూడా పెట్రోల్  ధర పెరిగింది దీంతో లీటరుకు రూ. 107.78 చేరింది. డీజిల్ ధరలు కూడా పెరిగి లీటరుకు రూ. 100 పరిమితికి దగ్గరగా ఉన్నాయి.  

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.22, లీటర్ డీజిల్ ధర రూ .100.25.

పెట్రోల్,  డీజిల్ ధరలపై స్థానిక పన్నుల బట్టి రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. అక్టోబర్ 18, 19 తేదీలలో ఇంధన ధరలు సవరించలేదు. దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 100 మార్కును అధిగమించగా, డజనుకు పైగా రాష్ట్రాల్లో డీజిల్ ధర  సెంచరీ దాటేసింది.

సెప్టెంబరు 28 నుండి మూడు వారాల ధరల రివిజన్ ముగిసిన తర్వాత పెట్రోల్ ధర 20 సార్లు పెరిగింది. సెప్టెంబర్ 24 నుండి డీజిల్ ధరలు 23 సార్లు పెంచబడ్డాయి. ఒక్క అక్టోబర్ నెలలో 18 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పటివరకు అక్టోబర్ నెలలో 6 రూపాయలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.

అంతకు ముందు మే 4 నుండి జూలై 17 మధ్య పెట్రోల్ ధర లీటరుకు రూ .11.44 పెరిగింది. డీజిల్ ధర లీటరుకు రూ.9.14 పెరిగింది.

హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ పై 37 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ.111.55, డీజిల్ రూ.104.70గా ఉంది.

click me!