నష్టాల నుండి కోలుకున్న స్టాక్ మార్కెట్ : నేడు లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..

Ashok Kumar   | Asianet News
Published : Dec 07, 2021, 04:55 PM IST

సానుకూల ప్రపంచ సూచనల మధ్య బ్యాంకింగ్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లలో లాభాల మద్దతుతో భారతీయ స్టాక్ మార్కెట్(stook market) నేడు లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 886 పాయింట్ల లాభంతో 57,633 వద్ద, నిఫ్టీ 264 పాయింట్లు లాభపడి 17,176 వద్ద ముగిశాయి.  

PREV
13
నష్టాల నుండి కోలుకున్న స్టాక్ మార్కెట్ : నేడు లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..

ఈ రోజు ట్రేడింగ్  వారంలోని రెండవ రోజున షేర్ మార్కెట్ ప్రకాశవంతమైన స్టయికి చేరుకుంది. ఉదయం లాభాల్లో  ప్రారంభమైన తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రెండూ రోజంతా ఊపందుకున్నాయి. చివరికి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 886.51 పాయింట్ల లాభంతో 57,633.65 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా లాభాల్లోకి ట్రేడవుతు 264.45 పాయింట్ల లాభంతో 17,176 స్థాయి వద్ద ముగిసింది.

1,000 పాయింట్లకు పైగా లాభపడి 
ఈ రోజు ట్రేడింగ్‌లో బి‌ఎస్‌ఈ సెన్సెక్స్‌ 1060 పాయింట్లు లాభపడింది. దీంతో పాటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా జోరుగా ట్రేడవుతూ 310 పాయింట్లతో గరిష్ట స్థాయిని తాకింది. మంగళవారం ఉదయం షేర్ మార్కెట్ గ్రీన్ మార్క్‌తో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సెన్సెక్స్ 455.48 పాయింట్లు లేదా 0.80 శాతం లాభంతో 57,202.62 వద్ద ప్రారంభం కాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 106.70 పాయింట్లు లేదా 0.63 శాతం లాభంతో 17,019 వద్ద ప్రారంభమైంది.
 

23

సోమవారం భారీ పతనం 
సోమవారం కరోనా  కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) భయాందోళనలు స్టాక్ మార్కెట్లో మళ్లీ కనిపించాయి. దీంతో స్టాక్ మార్కెట్‌ ప్రారంభ ర్యాలీని చివరి వరకు నిలబెట్టుకోలేక పోయింది. దీంతో ట్రేడింగ్‌ ముగిసే సమయానికి భారీ పతనంతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ 949.32 పాయింట్ల దిగువన 57,000 దిగువకు పడిపోయి 56,747.14 స్థాయి వద్ద బ్రేక్ డౌన్ అయి ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా దాదాపు 284.45 పాయింట్లు క్షీణించి 17000 స్థాయి దిగువకు చేరి 16,912.25 వద్ద ముగిసింది.

టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు 3.63% వరకు పెరిగి సెన్సెక్స్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

 సెన్సెక్స్‌లో ఏషియన్ పెయింట్స్ 0.22% నష్టపోయి రూ.3,031 వద్ద ముగిసింది. బి‌ఎస్‌ఈ-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాప్ నేడు రూ. 3.46 లక్షల కోట్లు పెరిగి రూ. 260.20 లక్షల కోట్లకు చేరుకుంది. సోమవారం మార్కెట్ క్యాప్ రూ. 256.74 లక్షల కోట్లకు పడిపోయింది.

సెక్టోరల్ వారీగా చూస్తే బ్యాంకింగ్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లాభాల్లో ముందంజలో ఉన్నాయి. బిఎస్‌ఇ బ్యాంకెక్స్ 1,034 పాయింట్లు పెరిగి 41,706 వద్ద, బిఎస్‌ఇ కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 765 పాయింట్లు లాభపడి 43,300 వద్ద ఉన్నాయి. మొత్తం 19 బీఎస్ఈ సెక్టోరల్ ఇండెక్స్‌లు గ్రీన్‌లో ముగిశాయి.

33

జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ, "అంతర్జాతీయ మార్కెట్‌లలో విస్తృత కొనుగోళ్ల మద్దతుతో దేశీయ మార్కెట్లు రికవరీ సాధించాయి, అయితే హెల్త్‌కేర్ స్టాక్స్ నష్టపోయాయి. ఓమిక్రాన్ స్ట్రెయిన్ ఊహించినంత తీవ్రంగా ఉండకపోవచ్చనే నివేదికలతో గ్లోబల్ మార్కెట్లు ఆశాజనకంగా ట్రేడ్ అయ్యాయి.  అంతేకాకుండా, పాలసీ సడలింపు ద్వారా చైనీస్ సెంట్రల్ బ్యాంక్ అదనపు లిక్విడిటీని విడుదల చేయడంతో చైనీస్ మార్కెట్లను పెంచింది." అని అన్నారు.

ఎన్‌ఎస్‌ఈలో తాత్కాలిక డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) డిసెంబర్ 6న రూ. 3,361 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DII) రూ. 1,701 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

సోమవారం భారతదేశంలో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య 21కి పెరగడంతో బెంచ్‌మార్క్ సూచీలు ప్రతికూల నోట్‌తో సెషన్‌ను ముగించాయి. సెన్సెక్స్ 949 పాయింట్ల నష్టంతో 56,747 వద్ద, నిఫ్టీ 284 పాయింట్ల నష్టంతో 16,912 వద్ద ముగిశాయి. హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బజాజ్ ఆటో, టాటా స్టీల్ టాప్ సెన్సెక్స్ నష్టపోయిన వాటిలో 0.40% వరకు పడిపోయాయి.

దేశీయ ఈక్విటీలలో భారీ కొనుగోళ్లు స్థానిక కరెన్సీకి మద్దతు ఇవ్వడంతో రూపాయి ప్రారంభ లాభాలను చాలావరకు తొలగించింది, అయితే మంగళవారం యూ‌ఎస్ డాలర్‌తో పోలిస్తే 4 పైసలు పెరిగి 75.41 వద్ద స్థిరపడింది.

గ్లోబల్ మార్కెట్లు
ఆస్ట్రేలియా S&P/ASX 200 68 పాయింట్లు పెరిగి 7,313 వద్దకు చేరుకుంది. నిక్కీ 528 పాయింట్ల లాభంతో 28,455 వద్ద, షాంఘై కాంపోజిట్ 3,595 వద్ద స్థిరపడ్డాయి. హ్యాంగ్ సెంగ్ సూచీ 634 పాయింట్లు పెరిగి 23,983కి చేరుకుంది. ఐరోపాలో FTSE 86 పాయింట్లు పెరిగి 7,318 వద్ద, DAX 321 పాయింట్లు, CAC 146 పాయింట్లు పెరిగి 7,011 వద్ద ఉన్నాయి.

click me!

Recommended Stories