బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్: నేడు గంటల పాటు నిలిచిపోనున్న బ్యాంకింగ్ సేవలు..

Ashok Kumar   | Asianet News
Published : Dec 11, 2021, 12:08 PM IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆన్‌లైన్ సేవలు(online services) నేడు శనివారం రాత్రి 11.30 నుండి ఐదు గంటల పాటు నిలిచిపోనుంది. అంటే శనివారం రాత్రి 11.30 గంటల నుంచి ఐటీ సేవలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు ఎస్‌బీఐ శుక్రవారం ట్వీట్ ద్వారా తెలిపింది. 

PREV
14
బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్: నేడు గంటల పాటు నిలిచిపోనున్న బ్యాంకింగ్ సేవలు..

అలాగే ఈ సమయంలో వినియోగదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్, YONO, YONO Lite, UPI, మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందలేరు. ఎస్‌బి‌ఐకి దేశవ్యాప్తంగా 22 వేలకు పైగా శాఖలు, 57,889 కంటే పైగా ATM నెట్‌వర్క్‌లను కలిగి ఉంది.

24

ఈ విషయాన్ని ఎస్‌బీఐ  అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేసింది. మా  కస్టమర్లు ఈ అంతరాయనికి  సహకరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాము అని బ్యాంక్ తరపున ట్వీట్ చేస్తూ  తెలిపింది. అలాగే మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నాం అని వెల్లడించింది.

34

11 డిసెంబర్ 2021 రాత్రి 11.30 గంటల నుండి డిసెంబర్ 12, 2021 తెల్లవారుజామున 4.30 గంటల వరకు ఐటీ సేవలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని ట్వీట్‌లో పేర్కొంది. 


ఈ సేవలను  నిలిపివేయడానికి గల కారణాన్ని మెయింటెనెన్స్‌గా చెప్తూ ఎస్‌బిఐ ట్వీట్ చేసింది. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను 85 మిలియన్ల మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. 

44

 అలాగే, మొబైల్ బ్యాంకింగ్‌ను 19 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. YONOలో రిజిస్టర్డ్ కస్టమర్ల సంఖ్య 3.45 కోట్ల కంటే పైగానే ఉంది. ప్రతిరోజూ దాదాపు 90 లక్షల మంది ఇందులో లాగిన్ అవుతున్నారు అని తెలిపింది.

click me!

Recommended Stories