మీడియా నివేదికల ప్రకారం, పుట్టినరోజు వేడుకల కోసం 120 మంది అతిథులను ప్రైవేట్ జెట్ ద్వారా జామ్‌నగర్‌కు పంపనున్నారు. వీరిలో రణబీర్ కపూర్, అలియా భట్, సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, పార్థ్ జిందాల్ వంటి ప్రముఖ బాలీవుడ్ అండ్ క్రీడా ప్రముఖులు కూడా ఉన్నారు. పృథ్వీ అంబానీ పుట్టినరోజు సందర్భంగా సింగర్ అరిజిత్ సింగ్ ప్రదర్శన ఇవ్వనున్నారు.
పృధ్వీ అంబానీ మొదటి జన్మదినం సందర్భంగా పరిసర జామ్‌నగర్ పరిసర గ్రామాల్లోని 50వేల గ్రామస్తులకు ఆహారం పంపిణీ చేసేందుకు కూడా అంబానీ ప్రణాళికలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అనాథ శరణాలయాలకు బహుమతులు అందించాలని, పృథ్వీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశంలోని 150 అనాథ శరణాలయాల్లో చిన్నపాటి వేడుకలను నిర్వహించాలని యోచిస్తున్నారు.