లోన్ రకం, వ్యాపార అవసరాన్ని బట్టి తిరిగి చెల్లించే సమయం మారుతుంది. టర్మ్ లోన్‌లకు సాధారణంగా 7 నుంచి 10 సంవత్సరాల వరకు గడువు ఉండవచ్చు. వర్కింగ్ క్యాపిటల్ లోన్ నిబంధనలు వ్యాపారానికి సంబంధించిన నగదు ప్రవాహాన్ని బట్టి ఉంటాయి. లోన్ తీసుకునేటప్పుడు వ్యాపార పరిమాణాన్ని బట్టి 15 నుంచి 25 శాతం వరకు మార్జిన్ మనీ అవసరం కావచ్చు.
ఈ లోన్ కోసం SBI బ్రాంచ్‌లో లేదా బ్యాంకు వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు ఆధార్, పాన్ కార్డ్ వంటి KYC డాక్యుమెంట్లు, అడ్రస్ ప్రూఫ్, బిజినెస్ ప్లాన్ రిపోర్ట్ అవసరం. ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారు గత 3 ఏళ్ల ఫైనాన్షియల్ రిపోర్ట్స్, ఐటీ రిటర్న్స్, బ్యాంకు స్టేట్‌మెంట్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోన్ అనేది ఉచిత ఆర్థిక సహాయం కాదు. లోన్ మొత్తం, వడ్డీ, ఛార్జీలు, తిరిగి చెల్లించే నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే అప్లై చేయడం మంచిది. వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం, ఖర్చులు, నెలవారీ వాయిదాలు చెల్లించగలమా లేదా అని బేరీజు వేసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి.