Gold Rate Today: రాఖీ పండుగ నుంచి పసిడి ప్రియులకు ఊరట దొరుకుతోంది. కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చాయి. దీంతో పసిడి ధర ఎక్కడికి వెళ్తాయోనని కొనుగోలుదారులు ఆందోళన చెందారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
రాఖీ పండుగ నుంచి పసిడి ప్రియులకు ఊరట దొరుకుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.2,890 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,58,840 స్థాయికి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధరలోనూ భారీ తగ్గుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,650 తగ్గి రూ.1,45,050 వద్ద కొనసాగుతోంది.
23
రెండ్రోజుల్లో రూ.6వేలు పతనం
అంటే కేవలం ఒక్కరోజులోనే 24 క్యారెట్ల బంగారంపై దాదాపు మూడు వేల రూపాయల మేర తగ్గుదల కనిపించింది. ఇటీవలి కాలంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలకు చేరువగా పెరిగిన నేపథ్యంలో.. ఈ పతనం కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చింది. ఇక వెండి విషయానికి వస్తే.. పసిడి బాటలోనే వెండి ధర కూడా దిగొచ్చింది. కిలో వెండి ధరలో రూ.5,000 వరకు తగ్గుదల నమోదైంది. దీంతో విలువైన లోహాల మార్కెట్‌లో ఇవాళ మొత్తంగా అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
33
భారీగా తగ్గడానికి అసలు కారణం ఏంటి?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల విషయానికి వస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1,58,840 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,050 స్థాయిలో కొనసాగుతోంది. అయితే బంగారం ధరలు ఇంత భారీగా తగ్గడానికి అసలు కారణం ఏంటి? దీనికి కేవలం దేశీయ డిమాండ్ తగ్గడం మాత్రమే కారణం కాదు. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు కూడా పసిడి ధరలపై గట్టిగా ప్రభావం చూపించాయి.