Published : Nov 12, 2021, 12:10 PM ISTUpdated : Nov 12, 2021, 12:12 PM IST
డిజిటల్ రివోల్యుషన్ మన సాంప్రదాయకమైన ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థకు కొత్త రూపాన్ని ఇచ్చింది. పెద్ద నోట్ల రద్దు(demonitaisation) తర్వాత డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. దీనికి సమానంగా మోసాల సంఘటనలు కూడా పెరిగాయి. ఇలాంటి పరిస్థితిలో మీ అజాగ్రత్త పెద్ద నష్టానికి కారణం కావచ్చు.
మొబైల్ ఫోన్లలో టెంప్టింగ్ లింక్‌లు పంపి ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు ఈరోజుల్లో ఎన్నో బయటకు వస్తున్నాయి. మరోవైపు పండుగ సీజన్‌లో సైబర్ మోసాలకు సంబంధించిన సంఘటనలు 40 శాతం పెరిగాయి. ఇలాంటి సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఈ సైబర్ మోసాలకి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను హెచ్చరించింది. అంతేకాకుండా కొన్ని మార్గదర్శకాలను కూడా తెలిపింది, వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని అనుసరించాలి.
24
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను ఇలాంటి మోసాల పై హెచ్చరించింది అంతేకాకుండా నకిలీ మెసేజులు నివారించాలని వారికి సూచించింది. ఎస్‌బిఐ ప్రకారం ఒక వ్యక్తికి అధికారిక మెసేజ్ పంపినప్పుడు అందులో SBI, SB, SBIBNK, SBIINB, SBIPSG, SBINOతో మొదలవుతుంది.
34
ఈ పేర్లతో పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం కోసం మిమ్మల్ని అడుగుతు మరేదైనా మెసేజ్ వస్తే అప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ పండుగ సీజన్‌లో బ్యాంకుల పేర్లతో ప్రజలను మోసం చేసిన ఉదంతాలు అనేకం తెరపైకి వస్తున్నాయి.
44
మీరు కూడా అలాంటి మెసేజులు స్వీకరించినట్లయితే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ కేర్ నంబర్‌కు 1800-11-1211కి కాల్ చేయడం ద్వారా తనిఖీ చేయవచ్చు. నేటి డిజిటల్ యుగంలో ప్రతి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే అప్రమత్తత , చురుకుదనం మీ భద్రతకు మొదటి హామీ.