ఎస్‌బిఐ కస్టమర్లకు రాఖీ ఫెస్టివల్ ఆఫర్.. ఇలా షాపింగ్ చేస్తే 70% వరకు డిస్కౌంట్ పొందవచ్చు..

Ashok Kumar   | Asianet News
Published : Aug 16, 2021, 01:45 PM ISTUpdated : Aug 16, 2021, 01:48 PM IST

మీ దగ్గరి లేదా ఇష్టమైన వారికోసం బహుమతులు ఇచ్చే సమయం వచ్చేసింది..! ఈ రాఖీ  పండుగను మరింత ఆనందదాయకంగా, చిరస్మరణీయంగా ఉండేందుకు దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బి‌ఐ అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది. 

PREV
16
ఎస్‌బిఐ కస్టమర్లకు రాఖీ ఫెస్టివల్ ఆఫర్.. ఇలా షాపింగ్ చేస్తే 70% వరకు డిస్కౌంట్ పొందవచ్చు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బి‌ఐ) తాజాగా కస్టమర్లకు రక్షా బంధన్ కోసం ఐ‌జి‌పి.కంలో షాపింగ్ చేస్తే భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు తెలిపింది.


ఎస్‌బి‌ఐ కస్టమర్‌లు igp.comలో రాఖీ పండుగ గిఫ్ట్స్ కోసం చేసే షాపింగ్‌పై 70 శాతం వరకు భారీ డిస్కౌంట్ ఇస్తుంది. అలాగే ఎస్‌బి‌ఐ యోనో ద్వారా షాపింగ్ చేస్తే అదనంగా 20 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.

26

ఎస్‌బి‌ఐ అధికారిక ట్విట్టర్  ద్వారా  "igp.comలో బెస్ట్ ఆఫర్‌లతో ఈ రక్షాబంధన్ జరుపుకోండి. బహుమతుల కోసం షాపింగ్ చేయండి అలాగే 70% వరకు తగ్గింపు పొందండి. యోనో ద్వారా షాపింగ్ చేస్తే అదనపు 20% తగ్గింపు లభిస్తుంది. ఇప్పుడే యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి: sbiyono.sbi/index.html. " అని ట్వీట్ చేసింది.
 

36

ఐ‌జి‌పిలో ఈ భారీ డిస్కౌంట్లను పొందడానికి కూపన్ కోడ్ 'IGPSBI'ని ఉపయోగించాల్సి ఉంటుందని గమనించాలి. ఈ ఆఫర్ 22 ఆగస్టు 2021 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌లో కనీస కొనుగోలు పరిమితి లేదు. అయితే, గరిష్ట పరిమితి రూ .999 గా నిర్ణయించబడింది. రూ .999 వరకు మాత్రమే కొనుగోళ్లపై 20 శాతం డిస్కౌంట్ ప్రయోజనం లభిస్తుంది. దీని కోసం SBI ఒక కోడ్ జారీ చేసింది. ఈ కోడ్ నంబర్ SBI20 ఇది షాపింగ్ చేసేటప్పుడు అప్లై చేయాలి.
 

46

లైఫ్ స్టయిల్ స్టోర్.కామ్ నుండి వస్తువుల కొనుగోలుపై 60% వరకు తగ్గింపు లభిస్తుంది. డ్రెస్సులతో సహా ఈ స్టోర్ నుండి లగ్జరీ వస్తువులు, ఫ్యాషన్ వస్తువులు కొనుగోలు చేయవచ్చు. వీటి కోసం చెల్లింపులను యోనో యాప్ ద్వారా చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కస్టమర్లు ఎస్‌బి‌ఐ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఇవ్వబడుతుంది.

56

యోనో యాప్ లేని వారు యోనో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలి. యోనో యాప్ ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌కి సంబంధించి మరింత సమాచారం కోసం  ఎస్‌బి‌ఐ యోనో, sbiyono.sbi అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Sbiyono.sbi  అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా లాగిన్ అయిన తరువాత  'బెస్ట్ ఆఫర్లు' ఆప్షన్ ఎంచుకోవాలి. దానిని అనుసరించి 'IGP ఆప్షన్'ను ఎంచుకోవాలి. Igp.com నుండి షాపింగ్ చేసేటప్పుడు డిస్కౌంట్లను పొందడానికి పైన పేర్కొన్న కోడ్‌ని ఉపయోగించాలి.
 

66

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎస్‌బి‌ఐ గృహ రుణాలపై కూడా ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద కస్టమర్‌లు జీరో ప్రాసెసింగ్ ఫీజును పొందవచ్చు. ఎస్‌బీఐ మహిళా కస్టమర్‌లు 0.05 శాతం తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందేందుకు వెసులుబాటు కల్పించింది. యోనో వినియోగదారులు కూడా ఈ తగ్గింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎస్‌బి‌ఐ కస్టమర్లు 6.70 శాతం కంటే తక్కువ వడ్డీ రేటుతో గృహ రుణాలు తీసుకోవచ్చు.

click me!

Recommended Stories