పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. నేడు హైదరాబాద్ లో 10గ్రా., బంగారం ధరలు ఇలా ఉన్నాయి..!

First Published Aug 16, 2021, 12:39 PM IST

సోమవారం భారతదేశంలో బంగారం ధర రూ .47,000 మార్కును దాటింది. గత వారం ఐదు నెలల కనిష్టాన్ని తాకిన తర్వాత పసుపు లోహం ఇప్పుడు కోలుకుంది.

మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో అక్టోబర్ 16న ఉదయం 09:20 గంటలకు 10 గ్రాములకు అక్టోబర్ గోల్డ్ కాంట్రాక్టులు 0.14 శాతం పెరిగి రూ.47,006కు చేరుకున్నాయి. అయితే సోమవారం వెండి  సెప్టెంబర్ ఫ్యూచర్స్ ఆగస్టు 16న 0.06 శాతం తగ్గి రూ. 63,203కి చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు సోమవారం ఒక వారం గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 1,779.51 డాలర్ల వద్ద ఫ్లాట్ అయింది, ఇంతకుముందు ఆగస్టు 6 నుండి  1,780.82 డాలర్ల  వద్ద గరిష్ట స్థాయిని తాకింది. రాయిటర్స్ ప్రకారం యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి 1,781.20 డాలర్లకు చేరుకుంది. వెండి 0.2% తగ్గి ఔన్స్‌కు 23.69 డాలర్లకి చేరుకుంది. 

"గత రెండు ట్రేడింగ్ సెషన్ల నుండి మేము బంగారం, వెండిలో షార్ట్ కవరింగ్ ర్యాలీని చూశాము. ప్రస్తుత టెక్నికల్ చార్ట్ ప్రకారం బులియన్స్‌లో కొన్ని  కదలికలను మనం మళ్లీ చూడవచ్చు, మొమెంటం ఇండికేటర్ ఆర్‌ఎస్‌ఐ కూడా డైలీ చార్టులో అదే సూచిస్తోంది అని అమిత్ ఖారే, ఏ‌వి‌పి-రీసర్చ్ కామోడిటీస్, గంగానగర్ కమోడిటీస్ లిమిటెడ్ అన్నారు.

నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు ఉదయం (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాముకి రూ.4,401 ఉంది. 10 గ్రాములు ధర రూ.44,010 ఉంది.  
 

దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

 దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,360 ఉంది.

 చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,390 ఉంది.

 ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,160 ఉంది.

 కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,060 ఉంది.
 

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,010 ఉంది.

 కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,010 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 ఉంది.

click me!