ఎస్‌బి‌ఐ బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్.. త్వరలోనే నిలిచిపోనున్న ఈ సర్వీసులు..

First Published Aug 5, 2021, 3:10 PM IST

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగా బ్యాంకు ఎస్‌బి‌ఐ  బ్యాంక్ సంబంధించి ఏదైనా పనిని డిజిటల్‌గా చేయవల్సి వస్తే  ఈ వార్త మీకు ముఖ్యం. మీ ఖాతా ఎస్‌బి‌ఐలో ఉంటే ఆగష్టు 6 నుండి 7 తేదీలలో కొన్ని గంటల పాటు బ్యాంక్  సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. 

కాబట్టి  ఈ సమయంలో మీ ఏదైనా డిజిటల్ లావాదేవీ చేయాల్సి ఉంటే సర్వీస్ నిలిచిపోవచ్చు. ఈ నేపథ్యంలో ఎస్‌బి‌ఐ బ్యాంక్  ఖాతాదారులకు హెచ్చరికను కూడా జారీ చేసింది. ఎస్‌బి‌ఐ ఖాతాదారులు రెండు గంటల పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూ‌పి‌ఐ), యోనో ఇంకా యోనో లైట్ సదుపాయాన్ని పొందలేరని ఎస్‌బి‌ఐ ట్వీట్ చేసింది. 

నిర్వహణ  కారణంగా ఈ చర్య జరుగుతోందని తెలిపింది. ఆగష్టు 6 రాత్రి 10.45 నుండి ఆగష్టు 7 మధ్యాహ్నం 1.15 వరకు  బ్యాంక్ నిర్వహణ పనులు జరగనున్నట్లు  ఎస్‌బి‌ఐ ట్వీట్‌లో పేర్కొంది. అంటే మీరు కొన్ని గంటలపాటు ఈ సౌకర్యాల ప్రయోజనాన్ని పొందలేరు. 
 

మెరుగైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడానికి మేము ప్రయత్నిస్తున్నందున మా కస్టమర్‌లు మాతో సహకరించగలరని మేము అభ్యర్థిస్తున్నాం అని ఎస్‌బి‌ఐ తెలిపింది. గతంలో జూలై 16,  జూన్ 13న కూడా ఎస్‌బి‌ఐ  కొన్ని సేవలు ప్రభావితమయ్యాయి. ఎస్‌బి‌ఐ  డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్, యోనో, యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్, మే నెలలో నిర్వహణ పనుల కారణంగా ప్రభావితమైంది.

దేశంలో ఎస్‌బి‌ఐకి 22,000 కంటే ఎక్కువ శాఖలు, 57,889 ఏ‌టి‌ఎంలు ఉన్నాయి. 31 డిసెంబర్ 2020 నాటికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించే వినియోగదారుల సంఖ్య వరుసగా 85 మిలియన్లు, 19 మిలియన్లు. ఎస్‌బి‌ఐ బ్యాంక్  యూ‌పి‌ఐని ఉపయోగించే వినియోగదారుల సంఖ్య 135 మిలియన్లు.

click me!