Banking Rule Changes Effective April 1st: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) లో ఏప్రిల్ 1 నుంచి కొన్నిమార్పులు జరగనున్నాయి. ఎస్‌బీఐ కార్డ్ రివార్డ్ పాయింట్ల ప్రోగ్రామ్‌లో మార్పులు చేసింది. కొన్ని కేటగిరీల్లో తక్కువ రివార్డ్ పాయింట్లు వస్తాయి. ఉదాహరణకు స్విగ్గీలో ఆన్‌లైన్ పేమెంట్స్, ఎయిర్ ఇండియా టిక్కెట్లు కొనడం వంటివి ఉన్నాయి.
ఈ కొత్త రూల్స్ ఏ కార్డులకు వర్తిస్తాయి?
సింప్లీక్లిక్ ఎస్‌బీఐ కార్డ్, ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్, ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ ల్లో ఈ మార్పులు ఉంటాయి.