Saving Account: సేవింగ్స్ అకౌంట్‌లో ఎన్ని డ‌బ్బులు ఉండొచ్చు.? ఈ త‌ప్పులు చేస్తే ఇబ్బందులు త‌ప్ప‌వు

Published : May 24, 2026, 04:56 PM IST

Saving Account: ఇప్పటికీ చాలా మంది తమ పొదుపు మొత్తాన్ని సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల్లోనే ఉంచుతున్నారు. అయితే సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత వరకు డబ్బు ఉంచుకోవచ్చు? ఒక రోజులో ఎంత నగదు జమ చేయవచ్చు? లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉంచుకోవచ్చు?

సాధారణంగా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో డబ్బు ఉంచడానికి నిర్దిష్ట గరిష్ఠ పరిమితి ఉండదు. అంటే మీ ఆదాయం, అవసరాలకు అనుగుణంగా ఎంత మొత్తమైనా ఖాతాలో ఉంచుకోవచ్చు. అయితే కొన్ని బ్యాంకులు తమ ఇంట‌ర్న‌ల్ రూల్స్ ప్రకారం ప్రత్యేక నిబంధనలు అమలు చేయవచ్చు. మీ ఖాతాలో ఉన్న డబ్బు మీ ప్రకటించిన ఆదాయానికి, ఆర్థిక వివరాలకు అనుగుణంగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బు జమ అవుతూ ఉండి, దాని సోర్స్‌ స్పష్టంగా లేకపోతే బ్యాంకు లేదా ఆదాయపు పన్ను శాఖ వివరణ కోరే అవకాశం ఉంటుంది.

25
ఒక రోజులో ఎంత నగదు జమ చేయవచ్చు?

బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ఒకేసారి రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ చేస్తే పాన్ కార్డు వివరాలు ఇవ్వడం తప్పనిసరి. పాన్ కార్డు లేకపోతే ఫామ్‌ 60 లేదా ఫామ్‌ 61 సమర్పించాల్సి ఉంటుంది. అలాగే కొన్ని బ్యాంకులు రోజువారీ నగదు జమకు ప్రత్యేక పరిమితులు విధిస్తాయి. కొన్నిచోట్ల సేవింగ్స్ అకౌంట్‌లో రోజుకు రూ. 1 లక్ష వరకు నగదు జమ చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే ఈ పరిమితి బ్యాంకు, ఖాతా రకం ఆధారంగా మారవచ్చు.

35
ఏడాదిలో ఎంత నగదు జమ అయితే ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది?

ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ నుంచి మార్చి వరకు) సేవింగ్స్ అకౌంట్‌లో మొత్తం రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ అయితే, బ్యాంకు ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తుంది. ఈ మొత్తం ఒకేసారి జమ చేసినా, విడివిడిగా పలుమార్లు జమ చేసినా అదే నిబంధన వర్తిస్తుంది. ఇది కేవలం నగదు జమలకే వర్తిస్తుంది. ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్లు లేదా చెక్కుల ద్వారా వచ్చిన మొత్తాలకు ఈ ప్రత్యేక నిబంధన వర్తించదు.

45
రూ. 10 లక్షలు దాటితే వెంటనే పన్ను చెల్లించాలా?

ఖాతాలో రూ. 10 లక్షలకు పైగా నగదు జమ అయిందంటే వెంటనే పన్ను విధిస్తారనే అర్థం కాదు. అయితే ఆ మొత్తానికి సంబంధించిన వివరాలను ఆదాయపు పన్ను శాఖ పరిశీలించే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాయం ఎలా వచ్చింది? అనే వివరాలను అడగవచ్చు. మీరు చట్టబద్ధమైన ఆదాయ రికార్డులు, బ్యాంకు స్టేట్‌మెంట్లు, వ్యాపార లెక్కలు లేదా ఇతర ఆధారాలు చూపగలిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

55
నగదు జమ చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు

సేవింగ్స్ అకౌంట్‌లో పెద్ద మొత్తాలు జమ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ చేస్తే పాన్ వివరాలు తప్పనిసరి. ఖాతాలో జమ అయ్యే డబ్బుకు సరైన ఆధారాలు ఉంచుకోవాలి. ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఆదాయాన్ని సక్రమంగా ప్రకటించాలి. భారీ నగదు లావాదేవీలు చేసే సమయంలో బ్యాంకు నిబంధనలు తెలుసుకోవాలి. అనుమానాస్పద లేదా వివరాలు లేని నగదు లావాదేవీలను నివారించాలి. ఈ నియమాలను పాటిస్తే సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత మొత్తమైనా చట్టబద్ధంగా ఉంచుకోవచ్చు. అయితే పెద్ద మొత్తంలో నగదు జమ చేసే సమయంలో దాని సోర్స్‌కి సంబంధించిన సరైన పత్రాలు, రికార్డులు ఉండటం చాలా ముఖ్యం.

Read more Photos on
click me!

Recommended Stories