జస్ట్ రూ.10వేలు అప్పు చేసి వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి.. ఇప్పుడు రిలయన్స్, టాటాకు పోటీగా..!

కోటీశ్వరులు, మల్టి-మిలియన్ డాలర్ల వ్యాపారాలు నడుపుతున్న వ్యక్తులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు కాదు. నీరు పేదరికం నుంచి వచ్చి భారీ వ్యాపారాలు చేస్తున్న లక్షలాది మంది  ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తి ఈ బిగ్ బ్రాండ్‌కు యజమాని. అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్,  రతన్ టాటాకు చెందిన  వెస్ట్ సైడ్ కి ఇప్పుడు గట్టిగా పోటీగా నిలుస్తుంది.
 

Rs10000 only A man who started a business after taking a loan now Ambani is a competitor of Tata!-sak

ముఫ్తీ ఇండియాలో  ప్రసిద్ధి చెందిన పాపులర్ ఫ్యాషన్ బ్రాండ్. బెస్ట్  మెన్స్ వేర్  బట్టలు తయారు చేయడానికి ఈ బ్రాండ్ ప్రసిద్ధి చెందింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం దాదాపు రూ. 500 కోట్లు. అయితే, కంపెనీ వ్యవస్థాపకుడు తన బంధువులలో ఒకరి నుండి 10వేల  అప్పు తీసుకొని ఈ సక్సెస్ ఫుల్ బ్రాండ్‌ను ప్రారంభించాడు.

ముఫ్తీ వ్యవస్థాపకుడు కమల్ ఖుష్లానీ ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. అతని 19 సంవత్సరాల వయస్సులో అతని తండ్రి మరణించాడు. కమల్ ఖుష్లానీ తన కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి అప్పుడు క్యాసెట్ కంపెనీలో పని చేయడం ప్రారంభించాడు. కానీ ఫ్యాషన్ బ్రాండ్‌ని సృష్టించాలనేది అతని కల. కృషి, అంకితభావం కారణంగా అతను తన కలను నెరవేర్చుకోవడంలో విజయం సాధించాడు.
 

Rs10000 only A man who started a business after taking a loan now Ambani is a competitor of Tata!-sak

ముఫ్తీకి ఇప్పుడు దేశవ్యాప్తంగా 379 స్పెషాలిటీ బ్రాండ్ స్టోర్లు, 89 పెద్ద ఫార్మాట్ స్టోర్లు, 1305 మల్టీ-బ్రాండ్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి. ముఫ్తీ  ఉత్పత్తులలో షర్టులు, జీన్స్, ప్యాంటు, టీ-షర్టులు, షార్ట్‌లు, బ్లేజర్‌లు, చలికాలం  దుస్తులు/ఔటర్‌వేర్ ఇంకా  ఫుట్ వేర్  ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 498.18 కోట్లు.  గత ఆర్థిక సంవత్సరంలో 341.17 కోట్లు.
 


1992లో, కమల్ ఖుష్లానీ మిస్టర్ & మిస్టర్ అనే మెన్స్ షర్టుల తయారీ కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీని స్థాపించడానికి అతని అత్త నుండి 10,000 అప్పుగా తీసుకున్నారు.  అయితే ఆఫీసు అద్దె కట్టడానికి కమల్ దగ్గర డబ్బులు లేకపోవడంతో తన ఇంటిని ఆఫీసుగా, గోదాంగా మార్చుకున్నాడు.

1999లో కమల్ ఖుష్లానీ ముఫ్తీ అనే ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించారు. మొదట్లో కమల్‌కు బైక్‌ ఉండేది, దానిపై అతను వర్క్‌షాప్‌కి కొన్ని  కేజీల దుస్తులను తీసుకెళ్లేవాడు.
 

బట్టలు తయారు చేస్తూ అదే బైక్ పై బట్టలు నింపుకుని అమ్మేందుకు వెళ్లేవారు. కమల్ తన బైక్‌పై సూట్‌కేస్‌లో బట్టలు పెట్టుకొని అమ్మేవాడు. 2000 తర్వాత ప్రజలు మఫ్టీ జీన్స్ కొనడం ప్రారంభించినప్పుడు ముఫ్తీ ప్రజాదరణ పొందింది. భారతదేశంలో స్ట్రెచ్డ్ జీన్స్ తయారీని ప్రారంభించిన మొట్టమొదటి బ్రాండ్ ముఫ్తీ.

ముఫ్తీ బ్రాండ్ ఇప్పుడు ముఖేష్ అంబానీ రిలయన్స్ రిటైల్ అండ్  రతన్ టాటా  వెస్ట్‌సైడ్‌తో సహా అనేక బ్రాండ్‌లు ఇంకా  వ్యాపార సంస్థలతో పోటీ పడుతోంది. అలాగే  ఇతర వస్తువులతో పాటు బట్టలు, ఫుట్ వేర్ కూడా విజయవంతంగా విక్రయిస్తుంది.

Latest Videos

vuukle one pixel image
click me!