ఇతర డినామినేషన్ల కరెన్సీ నోట్లు తగినంతలో అందుబాటులోకి వచ్చిన తర్వాత రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టాలనే లక్ష్యం నెరవేరిందని పేర్కొంది. అందుకే 2018-19లో రూ.2,000 నోట్ల ముద్రణను నిలిపివేశారు. అటువంటి నోట్లు ఉన్న ప్రజలు, కంపెనీలు మొదట సెప్టెంబర్ 30 లోగా వాటిని మార్చుకోవాలని లేదా బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేసుకోవాలని కోరింది. తరువాత గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించారు.
అక్టోబరు 8 నుంచి 19 వరకు ఆర్‌బీఐ ఆఫీసులో ప్రజలు బ్యాంకు ఖాతాల్లో నగదు మార్పిడి లేదా విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నవంబర్ 2016లో రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దు తర్వాత వేగంగా నోట్ల రద్దు కోసం రూ. 2,000 నోట్లతో పాటు కొత్త రూ.500 నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టింది.